CPI's Narayana Turns Daily Labour in Chittor ఉపాధి కూలీగా మారిన సీపీఐ నారాయణ.. చెరువు పూడికతీత పనుల్లో..

Cpi narayana turns into daily labour in chittor district

CPI national secretary daily labour, CPI Narayana daily wage labourer, cpi Narayana daily wage workers, lake restoration work cpi narayana, CPI Narayana native village ianambakam, CPI Narayana Chittoor district, CPI Narayana NREGA workers, CPI Narayana, Ianambakam, Nagari, Chittoor, daily wage labour, NREGA workers, workers facilities, Andhra Pradesh

CPI national secretary K Narayana took part as a daily wage labourer along with other workers in lake restoration works for two days at his native village in Chittoor district. He also interacted with NREGA workers.

ఉపాధి కూలీగా మారిన సీపీఐ నారాయణ.. చెరువు పూడికతీత పనుల్లో..

Posted: 05/07/2021 10:53 PM IST
Cpi narayana turns into daily labour in chittor district

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఉపాధి కూలీగా మారిపోయారు. తమ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో ఉపాధి కూలీలలతో మమేకమై గత రెండు రోజులుగా కూలీగా మారి శ్రమధానం చేశారు నారాయణ. నమ్మశక్యంగా లేదు కదు.. కానీ ఇదే నిజం. ఉపాధి హామీ పథకాన్ని తొలినాళ్లలో వ్యతిరేకించిన తమ పార్టీ.. ఈ పథకంతో జరిగే మంచిని గుర్తించలేకపోయిందని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ పథకంతో గ్రామాల్లో చెరువుల పూడికతీతలు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణాలు జరుగుతుండటం సంతోషకరమని ఆయన అన్నారు. తన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయినంబాకంలో ఆయన గ్రామస్థులతో కలసి శ్రమదానం చేశారు.

రెండు రోజులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వచ్ఛందంగా ఉపాధి పనులు చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న ఊర చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు జాబ్ కార్డు లేదని, దీంతో శ్రమదానం చేశానని పేర్కొన్నారు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు మజ్జిగ అందించేవారని, చిన్న పిల్లల కోసం టెంట్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటి సదుపాయాలేమీ లేవని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి పనులు చేస్తున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles