US to give free beer to covid vaccine reciepients కరోనా టీకా వేయించుకున్న యువతకు ఉచితంగా బీరు.!

Free beer and doughnuts to promote vaccines for youth in united states

health, virus, us, vaccine, promotions, US, SYND, US vaccination, Joe Biden, free beer, free doughnuts, free baseball tickets, America, international

Free beer, free doughnuts, free baseball tickets and savings bonds -- government officials and businesses are teaming up to encourage Americans to get vaccinated against Covid-19. President Joe Biden wants 70 percent of adults to have received at least one shot by Independence Day on July 4, and overcoming vaccine hesitancy is key to reaching the goal.

కరోనా టీకా వేయించుకున్న యువతకు ఉచితంగా బీరు.!

Posted: 05/07/2021 12:04 PM IST
Free beer and doughnuts to promote vaccines for youth in united states

కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తున్నా.. యువత మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను వాక్సీన్ వేయించుకునేలా ప్రేరేపించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని భావించింది. అయితే టీకా తీసుకోవాలంటూ యువతను బలవంతపెట్టకుండా వారంతంట వారే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేసింది. యువతను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మార్గలను అన్వేషిస్తూ అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు ఉచితంగా బీరు బాటిల్ ను అందించాలనే నిర్ణయించింది. ఇది మన రాష్ట్రంలోనో లేక దేశంలోనో అనుకుంటే మాత్రం పోరబడినట్టే.. ఎందుకంటే ఈ ఉచిత బీరు పథకంతో యువతను వాక్సీనేషన్ వైపు ప్రేరేపించే పథకాన్ని ప్రవేశపెట్టింది అగ్రరాజ్యం అమెరికా కాబట్టి.

అగ్రరాజ్యం యువత కరోనా వైరస్ నేపథ్యంలో టీకాను తీసుకునేందుకు ముందుకురావడం లేదు. అయినా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు (18ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్.. యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలో ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు ఫార్మసీలు, రెస్టారెంట్లు, బీర్ల ఉత్పత్తిదారులు, సూపర్ మార్కెట్లు, క్రీడా బృందాలతో కలిసి యువత వద్దకు వెళ్తున్నారు. టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్‌ను డోనట్స్‌ను ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా ‘మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు’ అని పేర్కొన్నారు. 21ఏళ్లు పైడిన యువత మద్యం సేవించడాన్ని న్యూజెర్సీ రాష్ట్రం చట్టబద్ధం చేసింది. దీంతో ఈ 21ఏళ్లుపైడిన యువత మాత్రమే ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌కు అర్హులు. 

ఇకపోతే వెస్ట్ వర్జీనియా రాష్ట్రం సేవింగ్స్ బాండ్స్ ద్వారా యువతను టీకా తీసుకోవడానికి ప్రోత్సహిస్తోంది. 16-35ఏళ్ల వయసు కలిగి వారు టీకా తీసుకుంటే.. వారికి 100 డాలర్ల సేవింగ్ బాండ్ ను అందజేయనున్నట్టు వెస్ట్ వర్జీనియా రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. మేరీలాండ్ గవర్నర్ కూడా దాదాపు ఇటువంటి ఆఫర్నే ఆ రాష్ట్ర యువతకు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. క్రిస్పీ క్రీమీ అనే రెస్టారెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా యువతను పోత్రహిస్తోంది. వ్యాక్సినేషన్ కార్డుతో తమ స్టోర్ కు వచ్చిన యువతకు ఫ్రీగా డోనట్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. టీకా తీసుకుంటే ఇన్ని ప్రోత్సాహకాలను అందిస్తున్న నేపథ్యంలో టీకా కోసమో లేక ప్రోత్సాహకాల కోసమో యువత వాక్సీనేషన్ చేయించుకుంటారని ప్రభుత్వం అశిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health  virus  vaccine  US vaccination  Joe Biden  free beer  

Other Articles