India sees over 3.68 lakh new cases on May 2, 2021 దేశంలో 3.68 ల‌క్ష‌లు దాటిన కేసులు.. 24 గంటల్లో 3,417 మరణాలు

India sees dip in daily infections 3 68 lakh covid 19 cases and 3417 deaths reported

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

India on Monday witnessed a slight dip in the daily Covid-19 cases as it registered over 3.68 lakh fresh cases in the past 24 hours, according to the Union health ministry. India also saw 3,417 people succumbing to the Covid-19 virus in the past 24 hours, pushing the death toll due to the virus to 2,18,959.

దేశంలో కోవిడ్ ఉద్దృతి: 3.68 లక్షలు ధాటిన కేసులు.. 24 గంటల్లో 3,417 మరణాలు

Posted: 05/03/2021 02:11 PM IST
India sees dip in daily infections 3 68 lakh covid 19 cases and 3417 deaths reported

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో వివిధ రకాల సైయిన్ లు భారతీయులను పట్టి పీడిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు ఏకంగా మూడు లక్షల 68 వేల మార్కును అధిగమించాయి. నిన్నటితో పోల్చితే కాస్త నెమ్మదించిన కరోనా కేసులు వైద్యఅరోగ్యశాఖ అధికారులకు కాసింత ఉపశమనం కల్పించాయి. దీంతో దేశంలో మొత్తంగా కోటి 99 లక్షల మార్కును దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా కోటి 57 లక్షల 20 వేలకు చేరువలో వుంది. కాగా ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 3400లకు పైగా మరణాలు సంభవించాయి.

గత ఏడాది మార్చి నుంచి దేశంలో తన ప్రభావాన్ని ఉద్దృతంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.. నవంబర్ నుంచి కాసింత తగ్గుముఖం పడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెకెండ్ వేవ్ ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఒక్కరోజులో ఏకంగా నాలుగు లక్షల సంఖ్యకు పైబడి కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులను నమోదు చేసుకున్న దేశంగా భారత్ మిగిలిపోయింది. ఈ సెంకెండ్ వేవ్ కేసులు ఉద్దృతి మరింతగా పెరగడానికి కారణం దేశంలో కరోనా స్టైయిన్ రకాలు అనేకంగా నమోదు కావడమేనని కూడా వైద్యవర్గాలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాల్లో మహరాష్ట్ర ముందంజలో వుంది. మహారాష్ట్ర నుంచి 56647 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అధ్యధిక సంఖ్యలో కర్ణాటక నుంచి కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 37,733 కేసులు నమోదు కాగా, కేరళలో 31,959 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసులు ఏకంగా 30,857కు చేరగా, ఆంధ్రప్రదేశ్ లో 23,920 కేసులు నమోదయ్యాయి.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసిన గణంకాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 3,00,732 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఏకంగా 34,13,642 యాక్టివ్ కేసులు వున్నాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,642కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 29,16,47,037 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles