24 dead in Karnataka hospital due to oxygen shortage కర్ణాటకలో విషాదం.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి

Karnataka tragedy ias officer to submit probe report in 3 days

karnataka tragedy, IAS officer, Shivayogi Kalasada, Chamarajanagar district hospital, oxygen, government, porbe, karnataka, Yediyurappa, coronavirus, coronavirus news, coronavirus india, oxygen shortage, delhi coronavirus, maharashtra coronavirus, coronavirus live updates, oxford vaccine, coronavirus, corona cases in india, corona symptoms, corona vaccine, corona update, coronavirus

IAS officer Shivayogi Kalasada to conduct probe into the death of 24 patients at Chamarajanagar District Hospital, to submit the report within 3 days. This, after Chamrajnagar District Incharge Minister S Suresh Kumar ordered inquiry into the death of 24 patients

కర్ణాటక విషాదంపై దర్యాప్తు వేగం.. మూడు రోజుల్లో నివేదిక..

Posted: 05/03/2021 04:46 PM IST
Karnataka tragedy ias officer to submit probe report in 3 days

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తాండవిస్తున్న కర్నాటక రాష్ట్రంలో విషాదం అలుముకుంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సంభవించిన విషాదమే ఇక్కడా అలుముకుంది. కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ అందక కర్ణాటకలో 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అందులో 23 మంది కరోనా రోగులు కాగా, ఒకరు మాత్రం కరోనా రోగి కాదని సమాచారం. రాష్ట్రంలోని చామరాజానగర్ జిల్లా అసుపత్రిలోని రోగులు అసువులు బాసారని వార్తలు వచ్చినా.. ఈ వార్తలను సంబంధిత వైద్య, అరోగ్య అధికారులు మాత్రం నిర్థారించడం లేదు.

మరణాలు సంభవించిన మాట వాస్తమేనని అంగీకరిస్తున్న వైద్యాధికారులు.. అవి ఆక్సిజన్ అందక మరణించిన కేసులు మాత్రం కాదని తోసిపుచ్చుతున్నారు. అయితే మృతుల బంధవులు, కుటుంబసభ్యులు మాత్రం ఒక్కచోట గుమ్మిగూడి వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆక్సిజన్ లేకపోవడం కారణంగానే తమ వారు మరణించారంటూ.. నినాదాలు చేశారు. ఆసుపత్రి ఆవరణలోనే వారు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో్ విషయం మీడియాకు తెలిసింది. దీంతో్ అసుపత్రి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షించారు. 

ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎస్ సురేష్ కుమార్ విచారణకు అదేశించారు. అసుపత్రిలో మృతి చెందిన 24 మంది మరణాలపై డెత్ అడిట్ రిపోర్టును సమర్పించాలని అసుపత్రి అడ్మినిస్ట్రేషన్ వర్గాలను అదేశించారు. ఈ క్రమంలో అసుపత్రిలో సంభవించిన మరణాలన్నీ అక్సిజన్ లేక సంభవించినవేనన్న విషయాన్ని మంత్రి సురేష్ కుమార్ తోసిపుచ్చారు. అదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ మరణాలు సంభవించాయని, అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 మధ్యలో అసుపత్రిలో ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.

ఇక కర్ణాటకలోని చామరాజానగర్ జిల్లా అసుపత్రిలో చోటుచేసుకున్న విషాదంపై ఐఏఎస్ అధికారి ద్వారా విచారణ జరిపించేందుకు అదేశాలు జారీ చేశామని మంత్రి సురేష్ తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శివయోగి కళాసదా చేత ఈ విషాధఘటనపై విచారణ జరుపిస్తున్నామని తెలిపారు. 24 మంది మరణం ఆక్సిజన్ కొరతతో సంభవించిందా.? లేక మరే ఇతర కారణాలైనా వున్నాయా.? అన్న అంశంపై కారణాలను అన్వేషించనున్నారు. అయితే అక్సిజన్ కొరతకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles