TRS win Nagarjuna sagar, YSRCP win Tirupati by-poll నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్.. తిరుపతిలో వైఎస్సార్సీపీ గెలుపు

Bypoll ycp retains tirupati with huge margin trs wins nagarjuna sagar

CM YS Jagan, Jagan Mohan Reddy, Tirupati bypoll, YCP, tirupati lok sabha, guruvareddy, CM KCR, Andhra Pradesh, Nagarjuna Sagar By-election, Nagarjuna sagar, By Elections, by polls, Nomula Narsimhaiah, Nomula Bhaghat, Jana Reddy, Congress, TRS, Nalgonda, Telangana, Politics

The ruling YCP candidate Dr Gurumurthy has won the Tirupati parliamentary segment seat with a huge margin of 2,37,314 votes majority as he polled a total of 6,25,644 votes. While in Telangana, the ruling TRS retained Nagarjuna Sagar Assembly seat with a majority of 18,449 votes defeating his nearest rival Jana Reddy of the Congress.

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్.. తిరుపతిలో వైఎస్సార్సీపీ గెలుపు

Posted: 05/03/2021 12:33 PM IST
Bypoll ycp retains tirupati with huge margin trs wins nagarjuna sagar

నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ప్రచారం, కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. దీంతో కష్టసాధ్యమని భావించిన నాగార్జన సాగర్ అసెంబ్లీ స్థానాన్ని అధికార పార్టీ తిరిగి నిలుపుకుంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ పార్టీకీ ఈ విజయంతో తిరిగి మరోమారు తమ బలాన్ని నిరూపించుకుంది. దుబ్బాక ఉపఎన్నికతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎదురైన గుణపాఠాలను ఎదురుదెబ్బలను ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు గాయానికి మందు రాయగా, తాజాగా జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలు కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపింది.

నోముల నర్సింహయ్య అకాలమృతితో వచ్చిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలో.. ఆయన తనయుడు నోముల భగత్ కే అధికార పార్టీ టికెట్ ను కేటాయించగా, ఆయన విజయం పార్టీ శ్రేణులు, కార్యకర్తల కృషితో నల్లేరు మీద నడకలా మారింది. నోముల భగత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ఏకంగా 18 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 87,254 ఓట్లు రాగా, జానారెడ్డికి 68,805 ఓట్లు లభించాయి. దీంతో ఈ సారి ఖచ్చితంగా ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన జనారెడ్డి 18 వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలయ్యారు.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పార్లమెంటు స్థానాన్ని అధికార వైసీపీ పార్టీ దక్కించుకుంది. ఇక్కడి నుంచి బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఏకంగా రెండు లక్షల 37 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపోందారు. దీంతో తిరుపతి స్థానాన్ని అధికార వైసీపీ పార్టీ నిలబెట్టుకోవడంలో సఫలీకృతమైంది. వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ డాక్టర్ బి దుర్గా ప్రసాద్ గత ఏడాది కోవిడ్ బారిన పడి మరణించడంతో ఇక్కడ ఉపఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు త్రిముఖ పోటీ మధ్య సాగాయి.

అటు అధికార వైఎస్సార్సీపీ, ఇటు జనసేన-బీజేపి ఉమ్మడిగా బరిలోకి దిగడం, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సహా పలువురు స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అయితే ప్రధాన ప్రతిఫక్ష పార్టీగా వున్న టీడీపీని కూడా తోసిరాజుతూ జనసేన-బీజేపి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్ రత్నప్రభ తరపున బీజేపి జోరుగా ప్రచారం చేసినా అమె మాత్రం మూడవ స్థానానికే పరిమితం అయ్యారు. అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తికి ఈ ఎన్నికలలో మొత్తం 6,25,644 ఓట్లు పోలయ్యాయి. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై రెండు లక్షల 37 వేల పైచిలుకు ఓట్లతో గెలుపోందారు. కాగా పనబాక లక్ష్మీకి 3,54,253 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రత్నప్రభకు కేవలం 57 వేల పైచిలుకు ఓట్లు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles