Telangana youth attempts suicide, succumbs ఉద్యోగ నోటిఫికేషన్లు రావని యువకుడి ఆత్మహత్య

Depressed and jobless telangana youth attempts suicide succumbs

Kakatiya University, Sunil Naik, Employment notifications, superannuation age limit, Tejavat singh Tanda, gudur mandal, mahaboobabad district, MGM Hospital, Warangal, Telangana, Crime

An unemployed youth, who attempted suicide last week over not getting a job in the Telangana government, succumbed at a hospital on Friday. Sunil Naik, 26, a resident of Mahabubabad district, had consumed pesticide on March 26 in Hanamkonda and was admitted to a hospital in Hyderabad.

ఉద్యోగ నోటిఫికేషన్లు రావని కేయూ విద్యార్థి సునీల్ ఆత్మహత్య

Posted: 04/02/2021 04:06 PM IST
Depressed and jobless telangana youth attempts suicide succumbs

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం.. అందుకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ఇటీవల అమోదించిన చట్టంగా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ (25) ఆత్మహత్యకు యత్నించి అసుపత్రి పాలై చికిత్సపోందుతు ఇవాళ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన సునీల్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఇక రావని కలత చెంది గత నెల (మార్చి) 26న హన్మకొండలో పురుగుల మందు తాగిన సంగతి తెలిసిందే.

తాను చచ్చిపోతున్నది చేతగాక కాదని, తన మరణంతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే చచ్చిపోతున్నానని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆ యువకుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి సునీల్ కు అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, శుక్రవారం ఉదయం అతడి పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పోస్ట్​ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అతడి మరణవార్త తెలుసుకున్న విద్యార్థులు, బంధువులు భారీగా గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. సునీల్​ కుటుంబానికి సీఎం కేసీఆర్​ వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. కాగా, ఐదేళ్లుగా సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. 2016లో పోలీస్ నియామకాల్లో అర్హత సాధించిన అతడు.. ఫిజికల్ టెస్టుల్లో విఫలమయ్యాడు. ప్రస్తుతం హన్మకొండలోని నయీంనగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles