World's costliest crop is now under cultivation in Bihar హాప్ షూట్స్: దేశంలోనే అరుదైన పంట.. రైతులకు కాసుల పంట

Bihar is growing a crop that has market value of about rs 82 000 per kg

Hop shoots, Bihar, costly crop, Amresh Singh, costly vegetable, agricultural scientist Dr. Lal, Indian Vegetable Research Institute, Varanasi, Karamdih village, Navinagar block, Aurangabad, Bihar, Cancer, digestive system, depression, analgesic, insomnia

One kilogram of this vegetable costs about Rs 1 lakh! The cultivation of the world's costliest vegetable namely 'hop-shoots' has started on a trial basis in Bihar’s Aurangabad district. Intermediate-pass from Hazaribagh’s St. Columbus College in 2012, Amresh Singh, 38, a farmer from Karamdih village under Navinagar block of Bihar’s Aurangabad district, is the first to start hop-shoots cultivation on 5 kathas of his land.

హాప్ షూట్స్: దేశంలోనే అరుదైన పంట.. రైతులకు కాసుల పంట

Posted: 04/02/2021 03:15 PM IST
Bihar is growing a crop that has market value of about rs 82 000 per kg

హాప్ షూట్స్.. ఈ పేరు భారతదేశ రైతులు ఎప్పుడూ వినండరు. ఎందుకంటే రైతన్నవాడు తప్ప సమాజం కోసం మరెవరూ అంతగా అలోచించరు. సమాజంలోని ప్రతీ వాడికి అన్నం పెట్టాలనే తాను వేకువజామునే లేచి పోలానికి వెళ్లి కాయకష్టం చేసి.. పొలాన్ని చదును చేసే సమయం నుంచి పంట చేతికంది వచ్చే వరకు ఆరుగాలం కష్టించి కొద్దిపాటి లాభం చూసుకుని పంటను విక్రయించేస్తాడు. అలాంటి రైతు లాభాపేక్షతో వేసే కూరగాయల పంటలను కూడా తక్కువ ధరలకే దళారులకు విక్రయించేసి.. వాటి రేట్లు విని అంతకు అమ్ముతున్నారా.. అని అవేదన చెందుతాడు.

ఈ విషయాన్ని పక్కనబెడితే హాప్ షూట్స్ అనే పదాన్ని భారత దేశ ప్రజలకు కూడా చాలా తక్కువగానే వినింటారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. వారితో అక్కడి కూరగాయల గురించి మాట్లల్లో తెలుసుకున్నవారు తప్ప చాలా మందికి అసలు హాప్ షూట్స్.. అంటే ఏమిటో కూడా తెలియదు. అయితే ఇది ఒక రకం కూరగాయ. ఆకు కూరల తరహాలో ఇదొక పంట. అయితే అలాంటి ఇలాంటి పంట కాదు... కిలో రూ.85 వేలు పలికే సిరుల పంట. ఔనా అంటూ నోరు వెళ్లబెట్టకండీ.. దీనిని దేశవ్యాప్తంగా కేవలం ఒక్క రైతు మాత్రమే పండిస్తున్నాడు. దీనిని పెంచడానికి ఆయన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ పూర్తి సేంద్రీయ పద్దతిలో వేశాడు.

ఎవరతను.? ఏ రాష్ట్రం అంటారా..? బీహార్ లోని ఔరాంగాబాద్ జిల్లాకు చెందిన నావినగర్ బ్లాకు పరిధిలోని కరంది గ్రామానికి చెందిన అమ్రేష్ సింగ్ (38) అనే రైతు తన పొలంలో హాప్ షూట్స్ ను సాగు చేస్తున్నాడు. ఈ మొక్కలోని పువ్వు భాగాన్ని ఆహారంగా స్వీకరిస్తారు. ఈ పంట సాగు కోసం అమ్రేష్ రూ.2.5 లక్షలు వెచ్చించాడు. హాప్ షూట్స్ ను శాస్త్రీయంగా హ్యుములస్ లుపులస్ అని పిలుస్తారు. దీన్ని భారత్ లో తొలిసారిగా వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సాగు చేశారు. బీహార్ రైతు అమ్రేష్ వీటిని వారణాసి నుంచే తీసుకువచ్చి తన స్వగ్రామం కరాందీలో సాగు చేస్తున్నాడు.

ఎన్నో దివ్వౌషద గుణాలున్న కూరగాయలకు లేని ధర దీనికి ఎందుకు.. ఈ మొక్కలో ఎలాంటి గుణాలున్నాయి.? అన్న ఆసక్తి పెరుగుతోంది కదూ.. ఈ వు్వులో హ్యుములస్ లుపులస్ అనే అమ్లాలు ఉన్నాయని ఇవి మనిషిలోని కాన్సర్ కాణాలను సంహరించడంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ పువ్వులోని ఔషద రసాయన గుణాలు మనిసిలోని జీర్ణక్రియను పటిష్టం చేయడంతో పాటు మానసిక రుగ్మతలతో బాదపడుతున్నవారిని, ఎక్కువ దందుడుకు స్వాభావం వున్నవారిని కూడా ప్రశాంతత చేకూర్చుతుంది. దీంతో పాటు బీరు తయారీలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుండడంతో అంత ధర పలుకుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh