"I Am MK Stalin": Message After Tax Raids on son-in-law ‘‘నా పేరు స్టాలిన్..’’: ఐటీ దాడుల తర్వాత డీఎంకే అధనేత

Remember i am mk stalin says dmk chief after it raids on son in law

MK Stalin, DMK, ED Raid On MK Stalin Son In Law, Senthamarai, Sabareesan, Karthik, Mohan, El Venu, Tamil Nadu Politics

DMK chief MK Stalin's son-in-law was raided by Income Tax officials today, just four days before the Tamil Nadu election. Searches started around 8 am at four places in Chennai owned by Sabareesan and his associates.

‘‘నా పేరు స్టాలిన్.. గుర్తుపెట్టుకోండి’’: ఐటీ దాడుల తర్వాత డీఎంకే అధనేత

Posted: 04/02/2021 05:24 PM IST
Remember i am mk stalin says dmk chief after it raids on son in law

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో 57 గంటల వ్యవధిలో ప్రచారానికి బ్రేక్ పడుతున్నందన్న సమయంలో తెరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు కొనసాగాయి. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు, డీఎంకే పార్టీ అడ్వైజర్ల బృందంలో ఒకడైన శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై నగరం వెలుపల వున్న నీలంగరాయ్ లోని శబరీశన్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. స్టాలిన్‌ కుమార్తె సెంతమరయ్‌ భర్త శబరీశన్‌.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా దాడులు జరగడం పరిపాటే. ఒక ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఎన్నికలు రద్దు కావడం కూడా తమిళనాడు ప్రజలు వీక్షించారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన అర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ తంతు జరిగింది. విపరీతమైన ధన ప్రవాహం నడుస్తుందని ఎన్నికలను నిలిపేసినా.. ప్రజలిచ్చే ఫలితాన్ని మాత్రం వాయిదా పడిన ఎన్నికలలోనూ మార్చలేకపోయారు. ఇక ఈ సారి శాసనసభ ఎన్నికలకు ముందు డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గత నెల ఆ పార్టీ సీనియర్‌ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల కోసం భారీగా నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ నేపత్ంయలో ఐటీ దాడులు ముగిసిన తరువాత డీఎంకే అధినేత స్టాలిన్ తన పేరు ఎంకే స్టాలిన్ అని.. తాను కళైంజ్ఞర్ (‘కరుణానిధి) తనయుడినని అన్నారు. తన పేరును ఐటీ అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. తాను ఎమర్జెన్సీతో పాటు మీసాలను కూడా ఎదుర్కోన్నానని అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరిపోయి.. మోకరిల్లేందుకు తాను అన్నాడీఎంకే నాయకుడిని కాదని.. ప్రధాని నరేంద్రమోడీ గ్రహించాలని అన్నారు. కాగా నిన్న స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్.. తన నియోజకవర్గంలోని ఓ సభలో మా్ట్లాడుతూ అక్రమంగా ఆదాయన్ని పెంచుకున్న అమిత్ షా తనయుడు జైషా గురించి ప్రశ్నించగానే మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఈ సందర్ంఘా ఆయన మాట్లాడుతూ.. తన సోదరి ఇంటిపై కాకుండా తన ఇంటిపై సోదాలు నిర్వహించాల్సిందిగా సవాల్ విసిరాడు.

తమిళనాడులో మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 6న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 2011 నుంచి అధికారానికి దూరంగా ఉంటోన్న డీఎంకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టిగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. స్టాలిన్‌ ఎప్పటిలాగే కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ నుంచి ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి అరంగేట్రం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles