"BSY Interfering In My Ministry": Eshwarappa సీఎంపై గవర్నర్ కు పిర్యాదు చేసిన రాష్ట్ర మంత్రి

Karnataka minister complains to guv against cm yediyurappa

K S Eshwarappa, K S Eshwarappa writes to governor, karnataka BJP minister complain yediyurappa, Eshwarappa Yediyurappa, dk shivakumar Eshwarappa letter, karnataka BJP, Governor Vajubhai Vala, JP Nadda, PM Modi, Amit Shah, Karnataka, Politics

A Karnataka BJP minister has submitted a formal complaint against Chief Minister B S Yediyurappa to Governor Vajubhai Vala, accusing him of “serious lapses” and of running the administration in an “authoritarian way”..

ముఖ్యమంత్రిపై గవర్నర్ కు పిర్యాదు చేసిన రాష్ట్ర మంత్రి

Posted: 04/01/2021 01:54 PM IST
Karnataka minister complains to guv against cm yediyurappa

కర్ణాటకలోని యడ్యూరప్ప మంత్రివర్గంలో అసంతృప్తులు భగ్గుమన్నాయి. ఇప్పటికే రాసలీల కేసుతో ఒక మంత్రి తన పదవికి దూరం కావడం.. ఇక ఇందుకు సంబంధించిన కేసులో ఆరుగురు మంత్రులు తమ సీడీలను బహిర్గతం చేయకుండా న్యాయస్థానం నుంచి అదేశాలను పొందడంతో విపక్షాలను వారి రాజీనామాలను డిమాండ్ చేస్తున్న క్రమంలో తాజాగా ఆయన క్యాబినెట్ కు చెందిన మరో మంత్రి ఆయనకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానికి, ప్రధానికి, హోం శాఖా మంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం యడియూరప్పపై సొంత క్యాబినెట్ లోని మంత్రే ముఖ్యమంత్రిగా యడియూరప్ప తన పరిధిని మీరుతున్నారని అరోపించారు. తాను నిర్వహిస్తున్న శాఖలో ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన ఆరోపణలు చేశారు. 1977 క్యాబినెట్ అధికారాల విభజన నిబంధనలను సీఎం యడియూరప్ప అతిక్రమించారని ఆరోపించారు. ఓ జిల్లాకు చెందిన వ్యవహారాల్లో తన శాఖకు సంబంధించిన రూ.65 కోట్ల పనులకు సీఎం యడియూరప్పే ఆదేశాలు జారీ చేశారని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అన్నీ తెలిసి కూడా ఈ విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని, ఇదే ఒరవడి కొనసాగితే ఓ మంత్రిగా క్యాబినెట్ లో తన స్థానం ఏమిటో అర్థం కావడంలేదని ఈశ్వరప్ప వాపోయారు.

ఈ మేరకు ఈశ్వరప్ప సీఎంపై గవర్నర్ కు, బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఒకే ప్రాంతం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వీరువురీ మధ్య అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిన మైత్రిబంధానికి కార్ణటకలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలు వారిద్దరి మధ్య మైత్రిబంధానికి తూట్లు పడ్డాయి. ఈశ్వరప్ప, యడియూరప్ప ఒకే ప్రాంతానికి చెందివారు. శివమొగ్గ నుంచి వచ్చిన వీరు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలపై వీరుద్దరూ కలసి చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, 2019లో కాంగ్రెస్, జనతాదళ్ సర్కారు కూలిపోయిన సమయంలో ప్రభుత్వం ఏర్పాటుకు  సహకరించిన కొందరికి యడియూరప్ప మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ఈశ్వరప్పతో ఆయన సంబంధాలు క్షీణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BS Yediyurappa  KS Eshwarappa  Governor Vajubhai Vala  JP Nadda  PM Modi  Amit Shah  Karnataka  Politics  

Other Articles