Farmers’ Protest To Continue Its Long March Into Summer ఏప్రిల్ 10 ఎక్స్ ప్రెస్ హైవే బంద్.. మేలో పార్లమెంట్ మార్చ్

Farmers protest to block kundli manesar palwal expressway on april 10 long march into summer

samyukta kisan, Kundli-Manesar-Palwal (KMP) Expressway, farmers protest, farmers, farm laws, Parliament march, farmers agitation, farmers protests, farm laws, farmers protest in delhi today, farmers protest news in hindi, farmers protest latest news, samyukta kisan morcha, farm unions Delhi, politics

In a move to boost the ongoing protest against the new agricultural laws, the Samyukta Kisan Morcha (SKM) has announced that farmers will block the Kundli-Manesar-Palwal (KMP) expressway on April 10 for 24 hours and also hold a march to Parliament in May.

రైతుల అందోళన: ఏప్రిల్ 10 ఎక్స్ ప్రెస్ హైవే బంద్.. మేలో పార్లమెంట్ మార్చ్

Posted: 04/01/2021 12:59 PM IST
Farmers protest to block kundli manesar palwal expressway on april 10 long march into summer

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఢిల్లీ శివార్లలోని టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ప్రాంతాల్లో అందోళనకు దిగిన రైతులు తాజాగా వేసవిలో ఉద్యమ కార్యచరణను ఉద్దృతం చేయనున్నట్లు తెలిపారు. గతంలో పిలుపునిచ్చినట్టుగానే లక్ష ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పినట్టుగా కాకుండా.. ట్రాక్టర్ల స్థానంలో పార్లమెంటుకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నా లక్ష్యపెట్టని ప్రభుత్వానికి తామను ఇలానే వదిలేసి.. తమ సహనాన్ని పరీక్షిస్తోందని దుయ్యబట్టారు.  

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుంచి తాము చేపట్టిన ఉద్యమం నాలుగు నెలలు పూర్తి చేసుకుని ఐదవ నెలలోకి ప్రవేశించినా కేంద్రంలోని ప్రభుత్వం తమ ఎన్నికలు, రాజకీయాలు, సీట్లు, బలాబలాలకు మాత్రమే పరిమితం అయ్యింది కానీ.. తమ సమస్యలను పరిస్కరించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. మాట్లల్లో తాము చర్చలకు సిద్దం అంటూనే.. చేతల్లో మాత్రం అందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ తరుణంలో తాము తమ అందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేయనున్నామని రైతు సంఘాల నేతలు ఇవాళ పిలుపునిచ్చారు.

రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు బుధవారం తెలిపారు. ఏప్రిల్‌ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24 గంటల పాటు దిగ్భందించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు వెల్లడించారు. ఇక ఏప్రిల్ 13న బాల్ సాఖి పండగను ఢిల్లీ శివార్లలోనే చేసుకుని ఆ మరుసటి రోజు ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చట్టాల పరిరక్షిణ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటామని రైతు సంఘాలు చెప్పాయి. అలాగే మే నెల ప్రథమార్ధంలో పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. అయితే, ఏ రోజు నిర్వహించాలనే తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

ఈ మార్చ్‌లో రైతులతో పాటు కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, నిరుద్యోగ యువతను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులంతా తొలుత సింఘూ, టిక్రీ, గాజీపూర్‌ ప్రాంతాలకు వాహనాల్లో చేరుకోవాలని తెలిపారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని నేతలు తేల్చి చెప్పారు. ఒకవేళ మార్చ్‌లో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు దాడి చేస్తే రక్షణగా ఉండేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ ఆందోళనకారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 32 రైతు సంఘాలు సంఘటితంగా వున్న ఎస్కేఎం రైతు సంఘం ఈ మేరకు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles