HC vacates stay, allows probe against CM Yediyurappa ‘ఆపరేషన్ కమల’పై విచారణకు అదేశించిన హైకోర్టు

Karnataka high court allows probe against cm yediyurappa in operation kamala case

K S Eshwarappa, Karnataka High Court, Justice John Michael Cunha, Operation Kamala, Naganagouda Kandkur, Yediyurappa, dk shivakumar Eshwarappa letter, karnataka BJP, Governor Vajubhai Vala, JP Nadda, PM Modi, Amit Shah, Karnataka, Politics

A Karnataka BJP minister has submitted a formal complaint against Chief Minister B S Yediyurappa to Governor Vajubhai Vala, accusing him of “serious lapses” and of running the administration in an “authoritarian way”..

‘ఆపరేషన్ కమల’పై విచారణకు అదేశించిన హైకోర్టు

Posted: 04/01/2021 03:02 PM IST
Karnataka high court allows probe against cm yediyurappa in operation kamala case

కర్ణాటకలోని బీజేపి ప్రభుత్వంపై ముప్పేట దాడి కొనసాగుతోంది. అపరేషన్ కమలం పేరుతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి.. అదే అపరేషన్ శరాఘాతంలా తయారైందా.? అన్న అనుమానాలకు కూడా రేకెత్తుతున్నాయి. ఇప్పటికే రాసలీల కేసుతో ఒక మంత్రి తన పదవికి దూరం కావడం.. ఇక ఇందుకు సంబంధించిన కేసులో ఆరుగురు మంత్రులు తమ సీడీలను బహిర్గతం చేయకుండా న్యాయస్థానం నుంచి అదేశాలను పొందడంతో విపక్షాలు వారిని టార్గెట్ చేయడం జరిగాయి. ఇది చాలదన్నట్లు సీనియర్ బీజేపి నేతగా ఎదిగిన కెఎస్ ఈశ్వరప్ప రాసిన లేఖ కూడా తీవ్ర కలకలం రేపుతోంది.

తన గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్ కు పిర్యాదు చయడంతో క్యాబినెట్ లోనూ వ్యతిరేకత భగ్గుమంది. 1977 క్యాబినెట్ అధికారాల విభజన నిబంధనలను సీఎం యడియూరప్ప అతిక్రమించారని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపి అధ్యక్షుడు జేపి నడ్డాలకు కూడా ప్రతులను పంపారు. ఈ లేఖతో పాటు మంత్రుల రాసలీలల కేసు, అది చాలదన్నట్లు మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళిని ఉపఎన్నికలలో ప్రచారం చేయాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించడం అన్ని ఒకదాని వెంట ఒకటి ఆయన ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వున్నాయి. న్యాయవాది జగదీశ్ కూడా సీఎం ఓ నిందితుడితో వ్యవహించే తీరు ప్రజలకు ఏ విధంగా ప్రతిభింబిస్తుందో ఫలితాల రోజునే వెల్లడవుతుందని అన్నారు.

ఇక తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆపరేషన్ కమలను బీజేపీ చేపట్టిందనే ఆరోపణలు ఉన్న సంగతి  తెలిసిందే. ఆ రెండు పార్టీల నేతలు తమ పార్టీల సభ్యత్వాలకు రాజీనామా చేసి, బీజేపీకి మద్దతు పలికారు. అయితే వీరు రాజీనామాలు చేస్తే.. ఎన్నికల్లో మళ్లి తమ పార్టీపై పోటీకి అనుమతించడంతో పాటు గెలిచిన ప్రతీ ఒక్కరికి తమ క్యాబినెట్ లో మంత్రి పదవులను కూడా అప్పగిస్తామని క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని కాంగ్రెస్ అరోపించింది.

ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారపీఠంపై కూర్చొంది. యడియూరప్ప మరోసారి సీఎం పగ్గాలను చేపట్టారు. ఇదంతా ఆపరేషన్ కమల పేరుతో బీజేపీ వేసిన స్కెచ్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం వెనుక అవినీతి ఉందని ఆరోపించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని హామీలు ఇచ్చారని... వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ కమలపై విచారణ జరిపించవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles