TMC accuses BJP of tampering EVMs మధ్యాహ్ననికి బెంగాల్ లో 36శాతం, అసోంలో 26శాతం పోలింగ్

36 turnout in bengal 26 in assam till noon in phase 1 polls

West Bengal election,West Bengal Election 2021,west bengal election voting,west bengal election 2021 voting,west bengal voting phase 1,West Bengal Assembly election,west bengal assembly election 2021,Election in West Bengal,election of west bengal,West Bengal polls,West Bengal Polls 2021,west bengal election news,west bengal election today,West Bengal Voting,west bengal voting start time,Assam election,Assam Election 2021,assam election voting,assam election 2021 voting,assam voting phase 1,Assam Assembly

Bengal and Assam began voting today in the first phase of Assembly elections for each state. Voting is taking place in 30 seats in Bengal and 47 in Assam. In Bengal, the ruling Trinamool and the opposition BJP - who have waged an often vicious campaign over the past few weeks - will each be eager to make a strong start.

పశ్చిమ బెంగాల్ తొలిదశ పోలింగ్ లో కాల్పులు.. పరస్పర ఆరోపణలు

Posted: 03/27/2021 01:20 PM IST
36 turnout in bengal 26 in assam till noon in phase 1 polls

పశ్చిమ బెంగాల్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంద‌ర్భంగా ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. పుర్బా మేదినిపూర్ జిల్లాలోని స‌త్సాతామ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొంద‌రు దుండగులు కాల్పులకు తెగబడి ఓటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఈ ఘటనలో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాలపాలుకావడంతో వారిని హుటాహుటిన అసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ నేతలు పరస్పరం అరోపణలు చేసుకుంటున్నాయి.

ఓటర్లను భయందోళనకు గురిచేసేందుకు తామే ఈ కాల్పుల ఘటనకు తెగబడ్డామన్న టీఎంసీ అరోపణలను బీజేపి తీవ్రంగా ఖండిస్తోంది. టీఎంసీ నేత‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, వారే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ నేత అనూప్ చ‌క్ర‌వ‌ర్తి ఆరోపించారు. కాగా పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి ఘటనలు ఇదివరకు ఎప్పుడూ జరగలేదని.. అలాంటిది ఈ సారి మాత్రమే జరిగాయంటే అందుకు బీజేపి కాక ఇంకెవరు కారణమని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లే కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారని అరోపిస్తున్నారు.  

కాగా, కోంటై నియోజ‌క‌వ‌ర్గంలోని 149వ నంబ‌ర్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద టీఎంసీ శ్రేణులు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ ‌నేత సువేందు అధికారి సోద‌రుడు సౌమెందు అధికారి ఆరోపణ‌లు చేశారు. బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతోన్న ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్ లోకి వెళ్ల‌కుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఓట‌ర్ల‌ను భ‌య‌ాందోళనకు గురిచేస్తున్నార‌ని చెప్పారు. దీనిపై  తాము ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశామ‌ని, ప‌లు విష‌యాల‌ను తెలిపామ‌ని ఆయ‌న అన్నారు. అయితే ఓటర్లు కాని వారిని కూడా ఓటర్లుగా మభ్యపెట్టి బీజేపి మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అడ్డుకుంటే బీజేపి ఓటర్లను అడ్డుకుంటున్నారని అరోపణలు చేస్తున్నారని టీఎంసీ నేతలు అరోపిస్తున్నారు.

ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 73 లక్షల మందికిపైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురూలియా, బంకురా, ఝూర్‌గ్రాం, తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

అసోంలోని 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 264 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరుగుతున్న 47 స్థానాలకు గాను 39 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అసోం గణ పరిషత్ 10 స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాజోత్ (గ్రాండ్ అలయెన్స్) 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఉత్సాహాన్ని చూపుతున్నారు. మధ్యాహ్నం సమయానికి బెంగాల్ లో 36శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 26.4శాతం ఓటింగ్ నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : First phase Elections  Assembly Elections  Assam  West Bengal  Gun fire  violence  BJP  TMC  Left Parties  Congress  Politics  

Other Articles