Police arrest kidnapers, rescues youth కిడ్నాపర్ల చెరలో లండన్ నర్సింగ్ విద్యార్ధి.. గంటల్లో విముక్తి

Police arrest members of kidnapping gang rescues youth

Kidnap, four-member gang, Rabiz Arapat, KG Halli police, Bengaluru Police, Rs 2 crore, Abdul Pahad, Jabiulla, Kurevel Salman, Toudt Pasha, Karnataka Crime

Police arrested a four-member gang who had kidnapped a 22-year-old boy and demanded Rs 2 crore for his release and if money was not paid his body will be cut into pieces and he will be murdered. Police said that the kidnappers arrested were identified as Abdul Pahad, Jabiulla, Kurevel Salman and Toudt Pasha.

కిడ్నాపర్ల చెరలో లండన్ నర్సింగ్ విద్యార్ధి.. గంటల్లో విముక్తి

Posted: 03/27/2021 12:17 PM IST
Police arrest members of kidnapping gang rescues youth

అడ్డదారిలో రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించి.. అప్పులు తీర్చుకుందామని ప్లాన్ చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తాపీగా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంతకీ అడ్డదారి ఏదంటే.. కిడ్నాప్. అయితే వీరి ఆటను పోలీసులు కూడా గంటల వ్యవధిలోనే కట్టించి.. అప్పులవారు రాని చోటకు తరలించేశారు. ఇక వీరంతా ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. నర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన దుండగుల ఆటను గంటల వ్యవధిలోనే కట్టించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన రబీజ్ అరాఫత్ లండన్ లో నర్సింగ్ ఎంఎస్ చదువుతున్నాడు. కరోనా లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతను ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నాడు. అయితే తనకు ఫోన్ కాల్ రావడంతో మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకు వచ్చాడు రబీజ్. అంతే అదే సమయం కోసం వేచిచూస్తున్న దుండగులు అప్పటికే అతన్ని ఫాలో చేస్తూ.. వెంటనే కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రబీజ్ తండ్రికి ఫోన్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కేజీహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించాయి.

చివరికి ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించి వారి నుంచి యువకుడిని రక్షించారు పోలీసులు. నిందితులు అబ్దుల్ పహాద్, జబీవుల్లా, సయ్యద్ సల్మాన్, తౌహీద్‌లను అరెస్ట్ చేశారు. మరికొందరితో కలిసి వీరు ఈ కిడ్నాప్ పథకం పన్నినట్టు పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌లు చేయాలని నిర్ణయించిన ముఠా.. నగరంలోని ధనవంతుల గురించి ఆరా తీసింది. ఈ క్రమంలో రబీజ్ కుటుంబం కారును కొనుగోలు చేసిన విషయం తెలుసుకుని కిడ్నాప్ ప్లాన్ రచించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్‌ సూత్రధారి అయిన అబ్దుల్ పహాద్‌పై గతంలోనూ కిడ్నాప్ కేసు నమోదైనట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kidnap  four-member gang  Rabiz Arapat  KG Halli police  Bengaluru  Rs 2 crore  Karnataka Crime  

Other Articles