‘Lady Singham’ RFO found dead ఐఎఫ్ఎస్ అధికారి లైంగిక వేధింపులతో ‘లేడి సంగమ్’ ఆత్మహత్య

Maharashtra s lady singham found dead suicide note accuses senior forest officer

lady singham, Dipali Chavan-Mohite, range forest officer, Melghat Tiger Reserve, indian forest service, IFS officer, Vinod Shivkumar, Deputy Conservator of Forests (DCF), chikaldhara, amravati, maharashtra, Crime

In a shocking incident, a 28-year-old female Range Forest Officer posted in the Melghat Tiger Reserve (MRT) in Amravati, died by suicide after alleging sexual harassment and torture at the hands of an Indian Forest Service (IFS) officer, in a purported suicide note, officials said.

ఐఎఫ్ఎస్ అధికారి లైంగిక వేధింపులతో ‘లేడి సంగమ్’ ఆత్మహత్య

Posted: 03/27/2021 11:19 AM IST
Maharashtra s lady singham found dead suicide note accuses senior forest officer

మహారాష్ట్ర ‘లేడీ సింగమ్’గా గుర్తింపు పొందిన 28 ఏళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. టైగర్ రిజర్వు సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న ఆమె అధికారిక క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్ తో అమె తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పొద్దుపోయాక తననుతాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. తనతో పాటు ఉన్న దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తన ధైర్య సాహసాలతో అటవీ మాఫియాకు కంటి మీద కునుకు దూరం చేసి ‘లేడీ సింగమ్’గా గుర్తింపు పొందిన దీపాలి ఆకస్మాత్తుగా ఇలా ఆత్యహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

తన సీనియరైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి లైంగిక వేధింపులను భరించలేక.. ఆయన నుంచి చిత్కారాలు, లైంగిక అవసరాలు తీర్చాలంటూ వేధింపులతో పాటు గర్భవతి నని కూడా చూడకుండా విధుల నిర్వహణలలోనూ ఆయన తీవ్ర ఒత్తిడి వుంటే విధులను అప్పగిస్తూ.. తనను తీవ్ర అందోళనకు గురిచేశాడని అమె నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహ్యలకు పాల్పడ్డారు. దీంతో ఇప్పుడా సూసైట్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీపాలి భర్త రాజేశ్ మొహితే చిఖల్ ధారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో దీపాలి పేర్కొన్న నిందితులను అరెస్ట్ చేసేంత వరకు అంత్యక్రియల కోసం దీపాలి మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తే లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.   

దీపాళి రాసిన సూసైడ్ నోట్ లో.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు చిత్రహింసలకు గురిచేశాడంటూ దీపాలి తన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్  (డీసీఎఫ్) వినోద్ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు అమరావతి తరలించారు. శివకుమార్ తనను గత కొన్ని నెలలుగా లైంగికంగా ఎలా వేధించిందీ, మానసికంగా ఎంతలా టార్చర్ పెట్టిందీ దీపాలి తన నోట్‌లో వివరించారు. అతడు తన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసిందీ ఆమె పూసగుచ్చినట్టు పేర్కొన్నారు.  

శివకుమార్‌ ఆగడాలపై దీపాలి పలుమార్లు ఆయన సీనియర్, ఎంటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ ఎంఎస్ రెడ్డీ (ఐఎఫ్ఎస్)కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారు. శివకుమార్ పబ్లిక్‌గా, ప్రైవేటుగా తనను అసభ్య పదజాలంతో దూషించేవాడని, శారీరక సంబంధం కోసం ప్రయత్నించేవాడని దీపాలి ఆరోపించారు. ఆయనను తాను దూరంగా పెట్టడంతో కష్టతరమైన అసైన్‌మెంట్స్, వర్క్ షెడ్యూల్స్ ఇచ్చి వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి తన వేతనాన్ని నెల రోజులపాటు హోల్డ్ చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.  

అడవిలో మూడు రోజులపాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉందని, తనతో పాటు రావాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న దీపాలిని శివకుమార్ బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమె గర్భిణి అన్న విషయం తెలిసీ కిలోమీటర్ల దూరం నడిపించాడు. వందలాది కిలోమీటర్లు తిప్పాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిందని దీపాలి సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భస్రావం కావడంతో దీపాలి తీవ్ర మనోవేదనకు గురైందని, తల్లి శంకుంతల చవాన్ ఊరడింపుతో ఆమె మళ్లీ మామూలు మనిషి అయిందని పేర్కొన్నారు. దీపాలి చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిస్తామని, నిందితులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles