Deputy tahsildar in ACB net for taking bribe అవినీతి జలగల ఆటకట్టించిన ఏసీబి.. పండగ చేసుకున్న రైతులు..

Farmers celebrated after dy tahsildar surveyor got arrested in bribery case

deputy tahsildar in acb net, surveyor in acb net, farmers celebrations in khammam vemsoor, deputy tahsildar UUpender in ACB net, vemsoor mandal Surveyor in ACB Net, Guruveshwar rao surveyor in ACB net, surveyor in bribery case, deputy tahsildar in bribery case, Khammam, Vemsoor mandal, Deputy Tahsildar, Surveyor, Farmers, celebrations, ACB officials, Telangana, Politics

The ACB officials nabbed a deputy tahsildar and a deputy surveyor red-handed while accepting a bribe of Rs 1 lakh from a farmer, at Vemsoor in Khammam district on Wednesday. The arrested persons have been identified as deputy tahsildar U Upender and deputy surveyor I Guruveshwar Rao.

అవినీతి జలగల ఆటకట్టించిన ఏసీబి.. పండగ చేసుకున్న రైతులు..

Posted: 03/25/2021 12:30 PM IST
Farmers celebrated after dy tahsildar surveyor got arrested in bribery case

ఖమ్మం జిల్లా వెంసూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలోని అవినీతి జలగల ఆటకట్టించిన ఓ రైతును అభినందించడంతో పాటు ఆ మండల పరిధిలోని రైతులు సంబరాలు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఉప తహసీల్దార్, సర్వేయర్ లు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబటడంతో స్థానిక రైతులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు రావడంతో.. రైతులు ఉన్నంతలోని తమ భూమిని భద్రపర్చుకునేలా మండల రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తున్నారు.

అలాగే జిల్లాలోని సత్తుపల్లికి చెందిన తోట సాంబశివరావు, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వేంసూరు మండలంలో 25 ఎకరాల మామాడితోట ఉంది. ఈ భూమిని ఇరుగు పొరుగువారు ఆక్రమిస్తుండడంతో ఇప్పటికే కొంత భూమిని కోల్పోయిన ఆయన.. ఈ విషయంలో తన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించి.. నివేదిక ఇవ్వాలంటూ ఆయన తహసీల్ధార్ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఉపతహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గురువేశ్వర్ రావులు ఇందుకోసం రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అంత ఇచ్చుకోలేనని, లక్షన్నర మాత్రమే ఇస్తానని, అది కూడా తొలుత లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానని సాంబశివరావు వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

తర్వాత సాంబశివరావు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారిచ్చిన సలహా ప్రకారం సాంబశివరావు లక్ష రూపాయలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చినట్టు చెప్పారు. వారు ఆ సొమ్మును బయట ఉన్న కారులో పెట్టమని చెప్పారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి ఆధారాలతో ఉప తహసీల్దార్, సర్వేయర్ లను అరెస్ట్ చేశారు. అనంతరం ఖమ్మంలోని ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 37,17,590 నగదు, 30 తులాల బంగారం, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఉపేందర్, గురవేశ్ అరెస్ట్ విషయం తెలిసిన సమీప గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంతోషంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khammam  Vemsoor mandal  Deputy Tahsildar  Surveyor  Farmers  celebrations  ACB officials  Telangana  Politics  

Other Articles