Telangana Govt good news to unemployees తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Retirement age raise won t affect filling up of vacancies in telangana harish rao

Harish rao, Finance Minister, Good news to unemployed youth, 50000 vacancies, notification, Telangana assembly approves retirement age, retirement age enhancement bill, Government vacancies in Telangana, Telangana, Politics

Telangana assembly unanimously approved the retirement age enhancement bill of the government staff in Telangana. And also said to issue the notification to fill 50.000 vaccancies in the state soon.

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Posted: 03/25/2021 01:00 PM IST
Retirement age raise won t affect filling up of vacancies in telangana harish rao

తెలంగాణ యువతకు శుభవార్తను అందించారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు. త్వరలోనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేలా 50 వేల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భర్తీకి ముందు ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా నోటీఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వయోపరిమితి పెంపు బిల్లును శాసనసభ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నష్టం లేదన్నారు. కాగా, రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా త్వరలోనే 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగయ్యాయని, ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్పు పెంపును అందరూ స్వాగతించాల్సిన పరిణామంగా చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉందని హరీశ్ చెప్పారు.

పీఆర్సీ నివేదికతో పాటు ఆయా విషయాలనూ దృష్టిలో ఉంచుకునే ఉద్యోగుల వయోపరిమితిని పెంచామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లూ ఇస్తామన్నారు. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకూ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకూ సభ ఆమోదం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles