MLA Jagga Reddy protests in front of Ambedkar statue ట్యాంక్ బండ్ అంబేధ్కర్ విగ్రహం ఎదుట జగ్గారెడ్డి నిరసన

Sangareddy mla t jayaprakash reddy protests in front of assembly

Sangareddy MLA, Turupu JayaPrakash Reddy, Jagga Reddy protest in front of Assembly, medical collage to Sangareddy, constituency Development funds, Jaya Reddy protest Ambedkar statue, placards, Election promises, Sangareddy constituency, Telangana, Politics

Sangareddy MLA Turupu JayaPrakash Reddy protests in front of Assembly after Marshals objecting him to enter into House with placards, on which he demands the government to fulfill the promises to the people of his constituency.

అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన.. తనయతో కలసి పాదయాత్రగా..

Posted: 03/25/2021 11:38 AM IST
Sangareddy mla t jayaprakash reddy protests in front of assembly

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ భైఠాయించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ అభివృద్దికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని 40 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన బాట పట్టారు. ఈ మేరకు రాసివున్న ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. అంతకుముందు ఆయన తన తనయ జయారెడ్డితో కలసి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.

అంతకుముందు ఆయన ఇవాళ ఉదయం లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తన తనయ జయారెడ్డితో కలసి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ వరకు తన తనయతో కలసి పాదయాత్రగా చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని, అందుకు నిరసన తెలుపుతూ ట్యాంక్ బండ్‌ నుంచి పాదయాత్రగా వచ్చానని చెప్పారు జగ్గారెడ్డి. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్లారు. అలాగే లోనికి కూడా వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ప్లకార్డులు ఉంటేనే లోనికి వెళ్తానని గేటు దగ్గరే బైఠాయించారు జగ్గారెడ్డి.

ఈ సందర్భంగా గన్ పార్క్ లోని మీడియాపాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం రాకపోవడంతో తాను ఈ నిరసనకు దిగానని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే దానిని సిద్దిపేటకు తరలించారని ఆయన అరోపించారు. 2013లో 5 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే.. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఖాళీ చేయించిందని అన్నారు. నియోజకవర్గంలోని 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Prakash Reddy  Jagga Reddy  Sangareddy  Medical collage  Protest  placards  Election Promises  Politics  

Other Articles