Telangana govt to decide on schools in few days పాఠశాల విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..

Telangana govt mulls promoting class 1 to 8 students due to corona scare

Telangana government, Coronavirus, KCR, Students, Chief Minister K Chandrasekhar Rao, State chief secretary Somesh Kumar, Telangana coronavirus, corona cases, telangana corona updates, Telangana corona second wave, Telangana govt promoting Class 1 to 8 students, CM KCR, School Students, classes 1 to 8, Promote, TS CS Somesh kumar, Education dept officials, Telanagana

Telangana government is mulling to promote Class 1 to 8 students without exams due to the rise in the coronavirus positive cases. At present, the schools are being run from Classes 6 and above. CM KCR held a review meeting and decision with respect to the same will be taken soon.

పాఠశాల విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ సారి కూడా..

Posted: 03/18/2021 11:13 AM IST
Telangana govt mulls promoting class 1 to 8 students due to corona scare

దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పలు కీలక సూచనలు చేశారని సమాచారం. ఈ తరుణంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరోమారు పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి ఎనమిదవ తరగతి వరకు విద్యార్థులను గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉన్నత తరగతులకు ప్రమోట్ చేయాలని భావిస్తోంది.

ఎనమిదవ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో రెండు, మూడు రోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోనూ కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగిన పక్షంలో మహమ్మారిని నియంత్రించే క్రమంలో ముందుగా విద్యార్థులను ఇళ్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎనమిదవ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఫ్రిబవరి 1 నుంచి రాష్ట్రంలో 9,10 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు అనుమతి నిచ్చింది. అయితే అంతకుముందునుంచే పలు పాఠశాలలు తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 24 నుంచి 6 నుంచి 8 తరగతుల వరకు ప్రత్యక్ష బోధనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. అయితే ఒకటి నుంచి ఐదువ తరగతి వరకు వున్న ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాత్రం అన్ లైన్ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, గురుకులాలు తెరిచిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు.

దీంతో ప్రభుత్వం పాఠశాల ప్రత్యక్ష బోధన విధానంపై పునరాలోచనలో పడింది.  8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని, వారిని ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 9, 10 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధనను కొనసాగించాలని, లేదంటే బోర్డు పరీక్షలు వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles