Train runs backwards for 35 kms in Uttarakhand రివర్సులో 35 కిమీ పరుగులు పెట్టిన రైలు..

Purnagiri jan shatabdi train runs backwards for 35 kms in uttarakhand video goes viral

Purnagiri Jansatabdi train ulta video, Purnagiri Jansatabdi train, Purnagiri Jansatabdi running backward, Purnagiri Jansatabdi train viral video, Purnagiri Jan Shatabdi train, Train, Purnagiri Jansatabdi train, Indian Railways, Indian train, Uttarakhand

In a shocking incident, a major accident averted on Wednesday in Uttarakhand after the Purnagiri Janshatabdi Express ran backwards after it ran over cattle. The incident took place between the Khatima-Tanakpur section. After the incident the passengers on the train got confused.

ITEMVIDEOS: రివర్సులో 35 కిమీ పరుగులు పెట్టిన రైలు.. వైరల్ వీడియో

Posted: 03/18/2021 12:43 PM IST
Purnagiri jan shatabdi train runs backwards for 35 kms in uttarakhand video goes viral

దేశంలో కరోనా అన్ లాక్ నాటి నుంచి కేవలం స్పెషల్ రైళ్లను మాత్రమే నడుపుతున్న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ.. మధ్యమధ్యలో పలు కోత్త రైళ్లను అదనంగా తీసుకువస్తోంది. ఓ వైపు ఉన్న రైళ్లను ప్రైవేటీకరించేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటూనే.. మరోవైపు దేశంలోని పలు మార్గాల్లో పలు రైళ్లను ప్రైవేటీకరణ కోసం కూడా ఐఆర్సీటీసీకి అహ్వానాన్ని పంపింది. ఈ క్రమంలో దేశంలోని ఓ మార్గంలో నడిచే తొలి ప్రైవేటు రైలును.. దాని నుంచి వచ్చే ఆదాయం.. ఖర్చులు, ఇత్యాధులను కూడా పరిగణలోకి తీసుకుని నెల రోజుల వ్యవధిలో ఎంత లాభం వచ్చిందో కూడా ఐఆర్సీటీసీ వివరాలను వెలువరించింది.

ఇలా రైళ్లను ఆదునీకరించి.. ప్రైవేటీకరించి.. దూర ప్రయాణాలను చేసే దేశ పేద,మధ్య తరగతి ప్రజలకు రైలు ప్రయాణాన్ని కూడా అందని ద్రాక్షాగానే మారుస్తారా.? అంటే మాత్రం రైల్వేను ఎప్పటికీ ప్రైవేటీకరించం అంటూ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. రైల్వే శాఖామంత్రి పియుష్ గోయల్.. రైల్వేను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోమని అన్నారు. ప్రైవేటు రైళ్లను పట్టాలపై నడుపుతామని ఓ వైపు లాభాన్ని పరిశీలించిన అధికారులు.. ఇప్పుడు మాటమార్చారా.. లేక ప్రజలను ఏమార్చారా.? అన్న విషయాలపై మరింత క్లారిటీ రావాల్సిందే. ఈ విషయాలను పక్కనబెడితే.. ఉత్తరాఖండ్ లో ఓ రైలు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం రివర్స్ లో పరుగులు తీసింది.

పూర్ణగిరి జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా అది ఏకంగా 35 కిలోమీటర్ల దూరం రివర్సులో పరుగెత్తింది. అయితే ఈ ఘటన చూసిన ప్రయాణికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అందోళనకు గురయ్యారు. రైలు వెనుకగా పరుగులు తీయడం ద్వారా రైలుతో పాటు రైలులోని ప్రయాణికులకు ఏదైనా అపద ముంచుకొచ్చే ప్రమాదం వుందా.? అన్న భయాందోళన కూడా రేకెత్తింది. నెట్టింట్లో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. దీంతో బుధవారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఉత్తరాఖండ్ లోని తనక్ పూర్ జిల్లా మీదుగా వెళ్తున్న సమయంలో ట్రాక్ పై పశువులు రావడాన్ని రైలు లోకోపైలెట్ గుర్తించాడు. దీంతో వెంటనే ఆయన రైలును నిలిపేందుకు సడన్ బ్రేక్ వేశాడు. అయితే వేగంగా వెళ్తున్న రైలును నిలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. రైలు ఆగింది. అయితే కాసేపటికి రైలు దానంతట అదే వెనక్కు వెళ్లింది. సడన్ బ్రేక్ వేస్తే రివర్స్ గేర్ పడినట్లైంది. ఇంకేముందు రైలు వెనక్కు వెళ్లింది. ఏకంగా 35 కిలోమీటర్ల దూరం ఇలా వెళ్లిందని రైల్వే అధికారులు తెలిపారు.

అయితే వెనక్కు వెళ్లే సమయంలోనూ రైలు అధిక వేగంతోనే ప్రయాణించింది. దీంతో ప్రయాణికులు అందోళనకు గురయ్యారు. మొదట రైలును లోకోపైలెట్ కావాలనే వెనక్కు నడుపుతున్నాడని భావించిన ప్రయాణికులకు.. ఏకంగా ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత వారికి కూడా విషయం బోధపడింది. లోకో పైలెట్ రైలు ఇంజన్ పై నియంత్రణ కోల్పోవడంతో.. ఏమీ చేయాలో కూడా తెలియని స్థితిలోకి జారుకున్నాడు. రైలు అగిన తరువాత ప్రయాణికులను కిందికి దించి ఖాతిమా నుంచి బస్సుల ద్వారా తనక్ పూర్ కు పంపారు. ఆ రైలు నడిపిన లోకోపైలెట్, గార్డ్ లపై అధికారులు సస్పెన్షన్ వేటువేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train  Purnagiri Jansatabdi train  Indian Railways  Indian train  Uttarakhand  

Other Articles