India needs Third Front: NCP supremo Sharad Pawar మూడో ఫ్రంట్ అంటూ శరద్ పవార్ నర్మగర్భవ్యాఖ్యలు

Therss need for a third front in country says ncp s sharad pawar

Nationalist Congress Party, NCP chief Sharad Pawar, Sitaram Yechury, PC Chacko, Maha Vikas Aghadi (MVA), Left Parties, Congress, BJP, Uddhav Thackeray, Shiv Sena, Mamata Banerjee, Trinamool congress, Politics

Nationalist Congress Party (NCP) chief Sharad Pawar said that a third front is needed in the country and stated that he is in talks with different parties for the same. "There is a need for a third front in the country but it has not been given a shape yet. We have been talking to different parties. Sitaram Yechury has also stated the need for it today," Sharad Pawar said.

మూడో ఫ్రంట్ అంటూ శరద్ పవార్ నర్మగర్భవ్యాఖ్యలు

Posted: 03/17/2021 04:19 PM IST
Therss need for a third front in country says ncp s sharad pawar

దేశ రాజకీయాలపై అపార అనుభవం వున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మూడో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైనా వుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏకచక్రాధిపత్యంతో దూసుకుపోతున్న బీజేపి పార్టీని అడ్డుకోవాలంటూ తృతీయ ఫ్రంట్ అవశ్యకత ఎంతైనా వుందని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కీలక పదవులను అలంకరించిన ఆయన స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. అయితే రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన ఆ పార్టీని వీడి వేరు కుంపటి పెట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో బీజేపి దూకుడును కాంగ్రెస్ ఎదర్కోవడం కష్టమన్ని అభిప్రాయపడిన ఆయన.. మూడో ఫ్రంట్ తోనే అది సాధ్యమని అన్నారు. అందుకోసం వామపక్ష పార్టీలతో కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో ఎన్సీపీలో చేరిన సందర్భంగా.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ శుభపరిణామం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే వివిధ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మూడో ఫ్రంట్ అవసరం ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా అన్నారని పవార్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల్లో ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ అత్యవసరమని.. ఇదే దేశాన్ని బీజేపి నుంచి కాపాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మూడో ఫ్రంట్ కోసం గళం వినిపించడంతో పాటు దేశ రాజకీయాలపై అపార అనుభవం వున్న నేతగా శరద్ పవారే ఈ తృతీయ కూటమిని సమీకరించడంతో పాటు నేతృత్వం వహిస్తారని ఎన్సీపీ వర్గాలు చెపుతున్నాయి. ఇక మహారాష్ట్రలో తమ కూటమి ప్రభుత్వం.. ప్రజలకు మరింత చేరువ అవుతోందని, ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తున్నారని కితాబిచ్చారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడుతున్న శరద్ పవార్... మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ లతో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కేరళలో వామపక్ష కూటమిలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీతో పవార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఎస్పీ, సమాజ్ వాది పార్టీలతో కూడా సాన్నిహిత్యం ఉంది. టీఆర్ఎస్, జేడీఎస్, వైసీపీలను కూడా మూడో ఫ్రంట్ లోకి పవార్ ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP  Sharad Pawar  Sitaram Yechury  PC Chacko  Maha Vikas Aghadi (MVA)  Left Parties  Congress  BJP  Politics  

Other Articles