devotees throng to Shiva Temples in Telugu states యాదాద్రిలో రేవ్ పార్టీ.. పోలీసుల మెరుపు దాడి..

Rachakonda police busts rave party in yadadri dist 97 held

Rave party on Maha Shivaratri night, rave party in Yadadri, Telangana police burst Rave Party, Rachakonda police foils rave party, Rave Party in Sansthan Narayanpur Farm House, Yadadri district Rave Party, Maha Shivaratri, rave party, Telangana police, Rachakonda police, Sansthan Narayanpur, Yadadri district, Telangana

Rachakonda police have busted a rave party organized at a farmhouse in Narayanpur of Yadadri Bhongir district and arrested seven organizers including the owner of the farmhouse. The advertising for this event was done through the Instagram page “Psydamru”.

ITEMVIDEOS: యాదాద్రిలో రేవ్ పార్టీ.. పోలీసుల మెరుపు దాడి.. 90 మంది అరెస్ట్

Posted: 03/13/2021 01:21 PM IST
Rachakonda police busts rave party in yadadri dist 97 held

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లు. ఫామ్ హౌజ్ లు, రిసార్టులు ఇలా ఎక్కడ తాము మకాం వేసి రేవ్ పార్టీలు నిర్వహించినా పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో శివారు కాకుండా నగరానికి ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో.. పల్లె వాతావరణంలో వున్న ఫామ్ హౌజ్ లు రేవ్ పార్టీలకు అడ్డగా మారుతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లోని మన్నెగూడ, చేవెళ్ల, పరిగి ప్రాంతాల్లోని పాంహౌజ్ లను వేదికగా మార్చుకున్నా.. పోలీసుల నిరంతర నిఘా.. పక్కాసమాచారంతో దాడులు నిర్వహించడంతో నిర్వాహకులతో పాటు రేవ్ పార్టీలో పాల్గోన్నవారిని కూడా అరెస్టు చేశారు.

దీంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వారాంతాలలో ఎక్కడ ఏ పార్టీ జరిగినా అక్కడ వాలిపోయి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు పోలీసులు ఆదమరిచేలా చేసి.. టెంపుల్ సిటీగా అభివృద్ది చెందుతున్న యాదాద్రి కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహించేందుకు గుట్టుగా ప్లాన్ చేస్తున్నారు. వారంతంలో పూర్తిగా మత్తులో తేలిపోతూ.. తామేం చేస్తున్నారో తమకే తెలియని విధంగా అటు మధ్యం, ఇటు మాదకద్రవ్యాలను తీసుకుంటూ.. అర్థనగ్నం నృత్యాలు.. అసాంఘిక కార్యాకలాపాలకు రేవ్ పార్టీలు అడ్డాలుగా మారి యువతను పూర్తిగా నాశనం చేసేలా తయారవుతున్నాయి.

ఈ క్రమంలో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ్‌పూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందులో పాల్గొన్న మొత్తం 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 ఎల్ఎన్‌డీ ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles