Gurugram: 1 dead, 3 injured after lightning strikes tree తలదాచుకుందామని చెట్టు చెంతన చేరితే.. నెత్తిన పిడుగు పడింది..

Lightning strike kills 1 injures 3 in gurugram residential township

Gurugram,Lightning Strike Caught On Camera,Lightning Strike On Four People,Viral Trending,Viral Video,social media,Lightning Strike On Four People In Gurugram, Gurugram lightning, 4 injured Gurugram lightning, Gurugram rains, Signature Villas, Sector 82 Gurugram, Haryana, Signature Villas apartment complex, Gurgaon Lightning strike,

Grabs from a CCTV camera in the area show the four men standing under a tree in the society while rain pours down on them. As a bolt of lightning strikes the tree, three of them collapse on the ground immediately, while the fourth falls seconds later.

ITEMVIDEOS: తలదాచుకుందామని చెట్టు చెంతన చేరితే.. నెత్తిన పిడుగు పడింది..

Posted: 03/13/2021 02:43 PM IST
Lightning strike kills 1 injures 3 in gurugram residential township

మండుటెండలు ఠారెత్తిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించి.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అకాలవర్షం కురిస్తే ఎవరైనా ఏం చేస్తారు. వర్షం నుంచి తప్పించుకునేందుకు దగ్గర్లోని ఏదైనా షెడ్డు కిందకో లేక మరేదైనా కట్టడం కిందకో పరుగులు తీస్తారు. అలాంటివేమీ కనబడకపోతే ఏ చెట్టుకిందకో పరుగులు పెడతారు. అలా అకస్మాత్తుగా కురుస్తున్న వర్షం నుంచి తప్పించుకుందామనో లేక తలదాచుకుందామనో చెట్టు కిందకు చేరిన నలుగరు వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలారు.

అసలేం జరిగింది. అప్పటివరకు చెట్టుకింద తలదాచుకుంటున్ననలుగురు వ్యక్తులు రెప్పపాటు క్షణంలో ఎందుకు కుప్పకూలారు. వారు విగతజీవుల్లో ఎందుకు పడివున్నారు. ఆ సమయంలో వారని గమనించి వైద్యచికిత్సల నిమిత్తం తరలించకుంటే పెనువిషాదం అలుముకునేంది. అకాలవర్షం కురుస్తున్నసమయంలో ఉద్యానవన సిబ్బందిగా వున్న వారిలో ఏ ఒక్కరూ ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడితే తమ పరిస్థితి ఏంటన్న అలోచనే వారికి రాలేదు. కానీ అదే జరిగింది. అకాలవర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఎక్కడో అయితే పర్వాలేదు.. కానీ వర్షానికి చెట్టుకిందన తలదాచుకుంటున్న ఈ నలుగరు అభాగ్యులు వున్న చెట్టుపైనే నేరుగా పడింది. ఇంకేముందు రెప్పపాటులో నలుగురు కుప్పకూలిపోయారు.

వీరిని గమనించిన స్థానికులు వెంటనే వారిని అసుపత్రికి తరలించగా వారిలో ఒకరు ప్రాణాలను కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇక మిగిలిన ముగ్గురు అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానాలోని గుర్గావ్ సెక్టార్-82లో క్రితం రోజు సాయంత్రం ఈ ఘటన సంభవించింది. ఆ చెట్టుపై పిడుగు పడిన తీరు చూస్తే నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉంటారనిపిస్తుంది. అయితే ముగ్గురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరో వ్యక్తి మాత్రం చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles