Novavax shot 96% effective against covid in final study కరోనాపై అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ‘‘నోవావాక్స్’’

Novavax vaccine 96 effective against original coronavirus 86 vs british variant in uk trial

Novavax Inc, Novavax covid vaccine, UK covid variant, covid vaccine efficacy, new covid variants, Novavax original coronavirus, subunit,SARS-COV2, Pfizer’s corona vaccine, Serum Institute corona vaccine

Novavax Inc’s COVID-19 vaccine was 96% effective in preventing cases caused by the original version of the coronavirus in a late-stage trial conducted in the United Kingdom, the company said on Thursday, moving it a step closer to regulatory approval.

కరోనావైరస్ పై అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ‘‘నోవావాక్స్’’

Posted: 03/13/2021 12:49 PM IST
Novavax vaccine 96 effective against original coronavirus 86 vs british variant in uk trial

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏడాది కాలం పట్టినా.. ఇప్పటివరకు ఏ వాక్సీన్ నూటికి నూరు శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్న దాఖలాలు లేదు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో అనేక టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు అన్నింటికన్నా అధికంగా ఫైజర్ ప్రభావవంతంగా పనిచేస్తోందని వారి గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తాజాగా అందుబాటలోకి వచ్చిన అగ్రరాజ్యం అమెరికాకు చెందిన వాక్సీన్ మాత్రం ఏకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇంతకీ ఆ వాక్సీన్ పేరేంటని అంటారా.. అదే ‘నోవావ్యాక్స్’ వాక్సీన్. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని వాక్సీన్ల కన్నా అత్యంత ప్రభావవంతంగా కరోనాపై పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలింది. చైనాలో అవిర్భవించిన యావత్ ప్రపంచానికి విస్తరించిన ఒరిజినల్ కరోనావైరస్ పై ఈ టీకా ఏకంగా 96.4 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లో తేలింది. అంతేకాదు బ్రిటెన్ లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా స్టెయిన్ పై కూడా 86శాతం ప్రభావం చూపుతుందని తాజాగా ప్రయోగాల్లో వెల్లడైంది. అంతేకాదు ఈ వాక్సీన్ డోసు తీసుకున్న వారిలో ఎలాంటి మరణాలు కానీ, లేక అనారోగ్య సమస్యలు కానీ తలెత్తకపోవడం గమనార్హం.

నోవావాక్స్ కరోనా వాక్సీన్ ఒక్క డోసు తీసుకున్నవారిలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే 83.4 శాతం ప్రభావశీలత చూపించినట్టు నోవావ్యాక్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిలిప్ డుబోవ్‌స్కీ తెలిపారు. బ్రిటన్‌లో 15 వేల మంది, దక్షిణాఫ్రికాలో నాలుగున్నర వేలమందిపైనా ప్రయోగాలు జరిపినట్టు ఫిలిప్ పేర్కొన్నారు. అంతేకాదు, దక్షిణాఫ్రికాలో 245 మంది ఎయిడ్స్ రోగులపైనా దీనిని ప్రయోగించినట్టు చెప్పారు. కరోనా ఒరిజినల్ స్ట్రెయిన్‌పై నోవావ్యాక్స్ టీకా 96.4 శాతం ప్రభావశీలత చూపించగా, యూకే స్ట్రెయిన్‌పై 86.3 శాతం సమర్థత చూపించిందని వివరించారు.

అయితే, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన స్ట్రెయిన్‌పై మాత్రం 55.4 శాతం ప్రభావశీలత చూపించినట్టు పేర్కొన్నారు. తాజా ఫలితాలు పూర్తి ఆశాజనకంగా ఉండడంతో టీకా అనుమతి కోసం వివిధ దేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను ఉత్పత్తి చేస్తున్న ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో నోవావ్యాక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ‘కోవావ్యాక్స్’ పేరుతో వంద కోట్ల డోసులను సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles