ఒక ప్రాణాన్ని తీయడం ఎంతో కష్టం.. ఇక ప్రాణం పోయడం మాత్రం మానవమాత్రులకు సాధ్యం కానిదే. కానీ ప్రాణాన్ని నిలపడం మాత్రం మనుషులకు సాధ్యమైన పనే. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలుగా వున్నవారి నుంచి తాము చేసిన పనిని చెప్పుకోవడం కూడా ఇష్టంలేని గోప్యదాతల వరకు ఎంతో మంది తమకు చేతనైన విధంగా ప్రాణాలను నిలిపేందుకు నిత్యం పాటుపడుతూనే వున్నారు. ఇక రైల్వే స్టేషన్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే విధుల్లో బాధ్యతగా మెలుగుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం తన విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించి ఓ ప్రాణాన్ని కాపాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.
కదులుతున్న రైలు ఎక్కబోయి.. పట్టుతప్పి.. రైలు చక్రాల కింద పడబోయిన ఓ మహిళను రెప్పపాటులో కాపాడి.. ఫ్లాట్ ఫామ్ పైకి చేర్చిన మహిళా కానిస్టేబుల్ సాహసాన్ని.. రై్ల్వే మంత్రిత్వశాఖ ప్రశంసించింది. అంతేకాదు ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ప్రోఫైల్ లో పోస్టు చేసింది. దీంతో మహిళా కానిస్టేబుల్ పై అనేక మంది నెట్ జనులు అమె సాహసాన్ని కీర్తిస్తున్నారు. స్టేషన్ కు రైలు చేరుకున్న తరుణంలో రైల్వే పోలీసులు స్టేషన్ ఫ్లాట్ ఫామ్ లపైకి వచ్చి ఎంతో అప్రమత్తంగా వుంటారని.. ఓ వైపున ప్రయాణికులపై మరోవైపు సంఘవిద్రోహశక్తులపై నజర్ వేస్తుంటారని నెట్ జనులు ప్రశంసిస్తున్నారు.
అసలేం జరిగిందీ.. అంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో రైల్వే స్టేషన్ లో ఓ జంట చేరుకుంది. అప్పటికే రైలు కదులుతుండటంతో.. ముందుగా లగేజ్ ధరించిన భర్త రైలులోకి ఎక్కాడు. చేతిలో లగేజ్ ధరించిన మహిళ లగేజీని రైలులోకి విసిరి.. రైలు ఎక్కబోయింది. అయితే అప్పటికే రైలు కొంత వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో అమె పట్టుకోల్పోయింది. దీంతో అమె చేయితో రైలును పట్టుకుంది కానీ.. కాళ్లు మాత్రం పట్టుతప్పిన కారణంగా పరుగెత్తలేకపోయింది. మరోలా చెప్పాలంటే రైలు అమెను ఈడ్చుకెళ్తోంది.
ఈ పరిణామాన్ని గమనించిన వినిత కుమారీ అనే రైల్వే కానిస్టేబుల్ పరుగుపరుగున బాధితురాలి వద్దకు చేరింది. చేరుతూనే అమెను రైలును విడిచిపెట్టమని అరచింది. అలాగే చేసినా.. కాళ్లు మాత్రం ఇంకా రైలు చక్రాలకు తాకుతూనే వుండటంతో.. వినిత కుమారి ఆమె చేయిని పట్టి అమెను ఫ్లాట్ పామ్ పైకి లాగింది. దీంతో రైలు చక్రాల కింద పడకుండా అమెను కాపాడగలిగింది. ఈ లోగా రైలులోని మిగిలిన ప్యాసెంజర్లు రైలు చైయిన్ లాగడంతో రైలు అగింది. దీంతో వారు మళ్లీ వెళ్లి రైలును ఎక్కారు.
అయితే బాధితులు ఎవరు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలు తెలియకపోయినా.. కదులుతున్న రైలును ఎక్కడం ఎంతటి ప్రమాదకరమోనని రైల్వే శాఖ ఈ వీడియోను తమ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. వినిత కుమారిపై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. కాగా పలువరు నెట్ జనులు మాత్రం ఏళ్ల నాటి రైళ్ల విధానాలను మార్చుతూ వచ్చిన ప్రభుత్వం ఎందుకనీ రైలు ఎక్కే విధానంలో మార్పులు తీసుకురాలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. రైలు డోర్ ల వద్ద అలారమ్ బటన్ పెట్టడం మూలంగా ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం వుంటుందని, లేదా మెట్రో తరహాలో రైలు డోర్ లు మూతపడే విధానాన్ని తీసుకురావాలని పలువురు కోరుతూ పోస్టులు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more