పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు మన రాష్ట్రంలో కొదవేలేదు. రాయి కూడా వెలుతురు పడితే మెరుస్తుందని తెలిసినా.. అది వజ్రం కాదన్న విషయం మాత్రం తెలుసుకోవడంలో మనిషి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అయితే అదే డాబు, ఎదుటి వారి ఆశ, నిర్లక్ష్యాలనే పెట్టుబడులుగా పెట్టుకునే మోసగాళ్లు మాత్రం అందినకాడికి దండుకుని శఠగోపం పెట్టి వెళ్తుంటారు.
సరిగ్గా ఇలానే జరిగింది. సినీఫక్కీలో తాను ఐపీఎస్ ఆఫీసర్ అంటూ.. డెహ్రాడూన్ లో ట్రైనింగ్ లో వున్నానంటూ.. ఇక జాతీయ మానవహక్కుల కమీషన్ చైర్ పర్సన్ అంటూ నోటికి వచ్చిన మాటలు చెప్పిన ఓ మాయలేడి.. నాటకాలను ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. అమెకు అరదండాలు వేయడంతో ప్రస్తుతం అమె కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. అమెతో పాటు వ్యాపారస్థుడిని మోసం చేయడంలో సహకరించిన మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా అనే మహిళ తన భర్తను వదిలేసి.. ఇద్దరు పిల్లలను కూడా కాదనుకుని మోసాలకు తెగబడింది. నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారి తమ్ముడికి తన చెల్లితో వివాహం చేసుకుందామని మాట కలపడంతో ఉబ్బితబ్బిబయిన వీరారెడ్డి పోలీసు ఐపీఎస్ అధికారి సంబంధం వస్తుందని ఎంతో సంబరపడ్డాడు. తాము కూడా సంపన్న కుటుంబం నుంచి చెందినవారమేనని.. నమ్మించగలిగింది.
ఇక ఈ క్రమంలో వీరారెడ్డి నుంచి తమ డబ్బు కొంత జామ్ అయ్యిందని.. తమకు డబ్బును అడ్జెస్ట్ చేయాలని కోరడంతో వీరారెడ్డి కూడా వెనకాముందు ఆలోచించకుండా అమెకు ఏకంగా పలు విడదలుగా ఏకంగా రూ.11 కోట్లు తీసుకుంది. ఇలా డబ్బును తీసుకున్న తరువాత అమె కాంట్రాక్టులోకి రాకపోవడంతో వీరారెడ్డి అమె గురించి కూపీ లాగడం ప్రారంభించాడు. దీంతో కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసి నాలుకు కర్చుకుని పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.6కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more