Cabinet approves President's rule in Puducherry పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు క్యాబినెట్ అమోదం..

President s rule imposed in puducherry after bjp refuses to stake claim

Puducherry, Puducherry news, President rule in Puducherry, Union Cabinet, Cabinet approves President rule Puducherry, Puducherry government, Tamilisai Soundararajan, Puducherry Lieutenant Governor Tamilisai Soundararajan, President rule, Union Cabinet, Tamilisai Soundararajan, Puducherry Lieutenant Governor

The Union Cabinet on Wednesday approved President's Rule in Puducherry after the Bharatiya Janata Party (BJP) and its allies did not stake claim to form government in the union territory, according to a report.

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు క్యాబినెట్ అమోదం..

Posted: 02/24/2021 06:58 PM IST
President s rule imposed in puducherry after bjp refuses to stake claim

పుదుచ్చేరిలో ప్ర‌భుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్ప‌కూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్.. పుదుచ్చేరిలో రాష్ట్ర‌ప‌తి పాల‌నకు ఈ రోజు సిఫార‌సు చేశారు. రెండు రోజుల క్రితం విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొని నారాయ‌ణ స్వామి ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌లేక‌పోవడం.. ప్రతిపక్షంలో వున్న అన్నాడీఎంకే, బీజేపి కూటమి కూడా తమకు అధికారం వద్దని వదులుకోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర క్యాబినెట్ కు సిఫార్సు చేశారు.

దీంతో త‌మిళిసై స‌మాలోచ‌న‌లు చేసి రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు సిఫార‌సు చేశారు. ఇందుకు సంబంధించిన సిఫార‌సు లేఖ‌ను ఆమె ఢిల్లీకి పంపారు. దీనిపై కేంద్ర కేబినెట్ కూడా అమోదం తెలిపింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి వచ్చిన లేఖపై సమావేశమైన కేంద్రక్యాబినెట్ ఇవాళ దానిని అమోదించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడటంతో ప్రతిపంలో వున్న అన్నా డిఎంకే-బీజేపి కూటమి పార్టీ కూడా తాము అధికారాన్ని అందుకోవడానికి విముఖత ప్రదర్శించిన నేపథ్యంలో లెప్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి ఈ మేరకు రాసిన లేఖను కేంద్రక్యాబినెట్ అమోదించింది.

ఇక రేపో లేదా ఎల్లుండి ఈ లేఖపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా అమోదం తెలుపగానే ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వ‌రస‌గా రాజీనామాలు చేయ‌డంతో పుదుచ్చేరిలో ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. మొత్తం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిత్ర‌ప‌క్ష‌ డీఎంకే ఎమ్మెల్యే ఒక‌రు రాజీనామా చేయ‌డంతో ఆ ప‌రిస్థితి త‌లెత్తింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన  ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అనంత‌రం బీజేపీలో చేరారు. పుదుచ్చేరిలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు ఉండ‌డం, ఇదే స‌మ‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి కిర‌ణ్‌బేడీని కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పించ‌డం, అనంత‌రం కాంగ్రెస్‌ రాజీనామాలు చేయ‌డం వంటి నాట‌కీయ ప‌రిణామా‌లు ఇటీవ‌ల ఉత్కంఠ రేపాయి. బీజేపీ తీరుపై ఇత‌ర పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles