CJI Bobde objects to being addressed as 'Your Honour' గౌరవంగా సర్ అని సంబోధించినా చాలు: సీజేఐ ఎస్ఏ బొబ్డే

Don t call us your honour not us supreme court sc judges tell law student

Supreme Court, Supreme Court judges, Supreme Court your honour, Supreme Court your lordship, Supreme Court raps law student, Supreme Court on your honour, US Supreme Court, indian magisterial court, Chief Justice of India, SA Bobde, Justice AS Bopanna,J ustice V Ram

A triple judge bench comprising Chief Justice SA Bobde, Justices AS Bopanna and V Ramasubramanian told the law student that when he addresses them as 'Your Honour', it seems like he has the American Supreme Court in mind

గౌరవంగా సర్ అని సంబోధించినా చాలు: సీజేఐ ఎస్ఏ బొబ్డే

Posted: 02/24/2021 05:57 PM IST
Don t call us your honour not us supreme court sc judges tell law student

కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను యువర్ ఆనర్ అని సంబోధించడంపై ఆయన సుత్తిమెత్తగా క్లాస్తీసుకున్నారు. అలా పిలుస్తున్నారంటే తాను అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినో, లేదా మేజిస్ట్రేట్ నో ఉద్దేశించి మాట్లాడుతున్నారని అర్థమని చెప్పారు. దీంతో ఈ పదాన్ని ఇకపై ఉచ్చరించనని న్యాయవిద్యార్థి కోర్టుకు తెలిపారు.

ఓ కేసుకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు హాజరైన ఓ న్యాయ విద్యార్థి.. మాలిక్ మజ్హర్ సుల్తాన్ వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మస్థానంలో తన వాదనలను వినిపించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో జస్టిస్ ఏఎస్ బొప్పన్నా, వి రామసుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులను ఉద్దేశించి ఆయన యువర్ ఆనర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

యువర్ అనర్ అనే పదం అమెరికాలోని సుప్రీంకోర్టులో.. లేదా ఇండియన్ మెజెస్ట్రిరియల్ కోర్టులలోనే వినియోగించాలని.. కానీ భారత్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాత్రం వినియోగించరాదని పేర్కోంది. వెంటనే సదరు న్యాయ విద్యార్థి స్పందిస్తూ... మీ లార్డ్ అని సంబోధిస్తానని చెప్పాడు. అలాంటి పదాలను వాడాలని తాము ఎప్పుడూ చెప్పలేదే అని వ్యాఖ్యానించారు. గౌరవంగా 'సర్' అని పిలిచినా తమకు ఆమోదమేనని చెప్పారు. గత అక్టోబర్ లో కూడా ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఇదే వ్యాఖ్యలు చేశారు.

ఇదే అంశానికి సంబంధించి 2014లోనే సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మైలార్డ్, యువర్ లార్డ్ షిప్, యువరానర్ వంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని అప్పట్లో జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. మరోవైపు, 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత లాయర్లపై ఉందని తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో యువరానర్ లేదా ఆనరబుల్ కోర్ట్ అని పిలవాలని... దిగువ కోర్టులు లేదా ట్రైబ్యునళ్లలో మాత్రం సర్ అని కానీ లేదా ప్రాంతీయ భాషల్లో దానికి సమానమైన పదాన్ని వినియోగించాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles