A colony from village evicted amid presence of evil forces కాలనీలో దెయ్యం.. వలస వెళ్లిన భయం..

A colony from village evicted amid rumours of evil forces presence

resence of Evil powers, beda budaga jangala colony, black magic, janagoan district, Tarigopula mandal, telangana police, crime

A colony from potharam village evicted amid rumours of presence of evil forces presence in the Janagoan village tarigopula mandal.

కాలనీలో దెయ్యం.. వలస వెళ్లిన భయం..

Posted: 02/24/2021 04:52 PM IST
A colony from village evicted amid rumours of evil forces presence

మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అనేక గ్రామాలు ఈ మూఢవిశ్వాసాల పరిధిని వీడి బయటకు రావడం లేదు. స్వతంత్రానికి ముందు, వచ్చిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు కూడా ఈ మూఢనమ్మకాలు రాజ్యాలు ఏలాయంటే అతిశయోక్తి కాదు.

ఈ మూడవిశ్వాసాలను తరిమేందుకు ఎందరో కారణజన్ములు కంకణబద్దులై అవిశ్రాంత పోరాటంతో కొంతమేర ఈ తరహా నమ్మకాలు తగ్గించారు. అయినా.. ఇప్పటికే గ్రామీణ భారతంలో మాత్రం గాఢాంధకార విశ్వాలు తిష్టవేసుకుని కూర్చున్నాయనడంలో అతిశయోక్తి లేదు. రెప్పపాటులో జరిగే చర్యలను కూడా సిసికెమెరాలతో రికార్డు చేసి.. ఇలా జరిగిందా.? అని సింహావలోకనం చేసుకనే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన రోజుల్లోనూ కొందరు మూఢ న‌మ్మ‌కాల‌తో ఇబ్బందుల‌ను కొని తెచ్చుకుంటున్నారు.

తాజాగా అలాంటి, దెయ్యం తిరుగుతుందన్న వదంతుల‌ను న‌మ్ముతోన్న ప్ర‌జ‌లు కాల‌నీ మొత్తాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన ఘ‌ట‌న జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో చోటు చేసుకుంది. దెయ్యాలు వున్నాయన్న కారణంగా దాదాపు 40 కుటుంబాలు గ్రామానని వదిలి వెళ్లిపోవడంతో కాలనీని విడిచిపెట్టడం గ‌మ‌నార్హం. బేడ,బుడగ జంగాల కాల‌నీలోకి వెళ్లి చూస్తే ఇప్పుడు ఒక్క‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. ఓ పాడుబడిన భవనంలో రాత్రి స‌మ‌యంలో దెయ్యం తిరుగుతోందని గ్రామ‌స్థులు భావిస్తున్నారు.

తమ కాలనీలో ఆడ‌ దెయ్యం నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని వ‌దంతులతో భయాందోళనకు గురవుతున్న కాలనీవాసులు.. కాలనీని వీడి వెళ్లిపోతున్నారు. ఆ కాలనీలో భాను, బాలరాజు అనే సోద‌రులు గత ఏడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మృతి చెందారు. ఇటీవ‌ల‌ రోడ్డు ప్రమాదంలో మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ‌ర‌ణాల‌కు దెయ్యమే కారణమని అనుమానిస్తున్న కాలనీ వాసులు.. బతికుంటే బలసాకులు తిని బతకోచ్చు అనుకుని కాలనీని వదలి ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.

ఇక తమ కాలనీకి చెందిన యువకులు మాత్రమే దెయ్యం ప్రభావానికి గురై చనిపోతున్నారని.. దీంతో తమకు ఊహవచ్చిన నాటి నుంచి ఉంటున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లక తప్పనిసరి పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. అంతేగాక‌, అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని, కాబ‌ట్టి దెయ్యం వ‌ల్లే అనారోగ్యం వస్తోందని అక్కడి ప్రజలు అమాయ‌కంగా మాట్లాడుతున్నారు. దెయ్యాలు ఉండ‌వ‌ని పోలీసులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నప్ప‌టికీ ఆ కాల‌నీ వాసులు త‌మ తీరును మార్చుకోవ‌ట్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh