IMA's remark 'uncalled for': Patanjali backs Harsh Vardhan in Coronil row బాబా రాందేవ్ అరెస్టుకు డిమాండ్.. కేంద్రమంత్రి చుట్టూ ‘‘కరోనిల్’’ ఉచ్చు..

Ima shocked over patanjali s claim on coronil demands explanation from harsh vardhan

Coronil, Patanjali Ayurved, Corona medicine, Baba Ramdev, union minister, Unon Health ministry, Harshavardhan, Viral news, patanjali ayurveds

The Indian Medical Association on Monday expressed shock and dismay at what it called is a “blatant lie of WHO certification” for Patanjali’s Coronil tablet, which the company said can be used to fight the COVID-19. It has also demanded an explanation from Health Minister Harsh Vardhan about his presence at the event where Coronil was launched last week.

బాబా రాందేవ్ అరెస్టుకు డిమాండ్..కేంద్రమంత్రి చుట్టూ ‘‘కరోనిల్’’ ఉచ్చు..

Posted: 02/24/2021 03:49 PM IST
Ima shocked over patanjali s claim on coronil demands explanation from harsh vardhan

కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన సంస్థ మరోమారు మీడియా ముందుకు వచ్చింది. తమ సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న అరోపణలు అనవసరమైనవిగా తోసిపుచ్చింది. దేశానికి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఎలాంటి నాణత్య ప్రమాణాలు లేని, పరిశోధనా పలితాలు లేని పతాంజలి దివ్య కరోనిల్ ట్యాబెట్ల లాంచింగ్ కు ఎలా హాజరయ్యారని ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విమర్శలు చేసింది.

ఇది దేశానికే అవమానంగా.. దేశీయ వైద్యం, ఔషదాలపై అపనమ్మకం కలిగేలా ఈ చర్యలు వున్నాయని, ఒక అదునిక వైద్యుడిగా కొనసాగుతూనే ఆయన ఇలాంటి ఔషదాలను ఎలా విడుదల చేస్తారని, ఆయన ధీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ఈ విమర్శలతో కేంద్రమంత్రి హర్షవర్థన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. కాగా ఈ విమర్శల నేపథ్యంలో మరోమారు పతాంజలి సంస్థ మీడియా ముందుకు వచ్చింది. తమ సంస్థకు సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ప్రోడక్ట్స్ నుంచి పోందిన సర్టిఫికేట్ వుందని పేర్కోన్నారు.

ఈ సర్టిఫికేట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అమోదం పోందిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసులకు మాత్రమే భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ అందిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే తామేు ఆయుష్ మంత్రిత్వశాఖకు తమ పరిశోధనల సారంశంలో కూడిన నివేదికను భారత ప్రభుత్వ కౌన్సిల్ ఫర్ మెడిసిన్ కు సమర్పించామని కూడా తెలిపింది. ఇలా పతంజలి అభివృద్ధి చేసిన ‘కొరోనిల్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సర్టిఫికెట్ ఉందని పేర్కొన్నారు. వాటిని అంశాల వారీ పరిశీలన తరువాత ఆయుష్ మంత్రిత్వశాఖ తమ పతాంజలి దివ్వ కరోనిల్ మాత్రలకు అనుమతిని మంజూరు చేసిందని పేర్కోంది.

కాగా, మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ నెల 19న రాందేవ్ బాబా కొరోనిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు. రాందేవ్ బాబా ప్రకటనపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొరోనిల్‌’కు తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేని వివరణ ఇచ్చింది. దీంతో రాందేవ్ బాబాపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తప్పుడు ప్రకటనతో ప్రజలను మోసగించిన ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు కూడా వారితో గొంతు కలిపాయి. తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్ కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాందేవ్ బాబా కోట్లాదిమందిని మోసం చేసే ప్రయత్నం చేశారని, దీనిని అంతర్జాతీయ మోసంగా చూడాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles