Pharma student, who weaved fake rape attempt, dies by suicide ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా అడిన యువతి ఆత్మహత్య.!

Ghatkesar bpharma student who did kidnap rape drama commits suicide

b pharmacy student suicide, b pharmacy student kidnap drama suicide, Rachakonda police, Mohan Bhagawat, b pharmacy student suicide, b pharmacy student keesara suicide, b pharmacy student ghatkesar suicide, auto driver suicide, pharma student rape drama ended life, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

In a very tragic ending, the 19-year-old B.Pharmacy student who misguided the police inorder to escape from her parent's house, created a drama stating that she had been kidnapped and gangraped by an auto rick shaw driver and a few others on Feb 10th, committed suicide today.

ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా అడిన యువతి ఆత్మహత్య.!

Posted: 02/24/2021 01:40 PM IST
Ghatkesar bpharma student who did kidnap rape drama commits suicide

ఘట్ కేసర్ లో తనను కిడ్నాప్‌, అటో డ్రైవర్లు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారని కట్టుకథను అల్లి.. పోలీసులను మూడు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఇటు అటో డ్రైవర్లు వెన్నులోనూ వణుకు పుట్టించి.. ట్విస్టులపైన టిస్టులతో రోజుకో మలుపు తిప్పిన బీఫార్మసీ విద్యార్థిని చివరకు విషాదంతం అయ్యింది. ఈ కేసు చేధించే క్రమంలోనూ పోలీసులతో ఎంతో ధైర్యాన్ని ప్రధర్శించిన యువతి.. చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.

తల్లిదండ్రుల ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని తాను ఈ నాటకానికి తెరలేపానని, అయితే పదే పదే తన తల్లి ఫోన్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఆడిన ఒక్క అబద్దాన్ని నిజం చేసేందుకు వరుసగా అనేక అబద్దాలు ఆడాల్సి వచ్చి.. చివరకు పొంతనలేని సమాధానాలతో అటు పోలీసులను కూడా నిద్రాహారాలకు స్వప్తిపలికించిన బీఫార్మ యువతి.. ఘటన జరిగిన తరువాత నుంచి తన మేనమామ ఇంట్లోనే ఉంటోంది. ఈక్రమంలో ఉదయం కొంత ఆలస్యంగా లేచే విద్యార్థిని ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంభసభ్యులు అందోళన చెంది అమెను ఆసుపత్రికి తరలించారు.

క్రితం రోజు రాత్రి పడుకునే సమయంలో నిద్రపట్టక పోవడంతో ఆమె మోతాదుకు మించిన పరిమాణంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.. దీంతో వెంటనే అమెను అమె కుటంబసభ్యులు స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు నిర్ఱయించారు. కిడ్నాప్ ఘటన తరువాత మానసికంగా అమె ఎంతగానో కుంగిపోయిందని.. పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమీషనర్ మోహన్ భగవత్ ఈ నెల 13న మీడియా సమావేశంలో ఫార్మా సెకండ్ ఇయర్ యువతి కిడ్నాప్ ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని తెలిపారు. అందిబాటులోకి వచ్చిన సాంకేతికతతో (సెల్ ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా) యువతిని ట్రేస్‌ చేశామని తెలిపిన ఆయన ఆ మరుసటి రోజున విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలకు రేకెత్తాయని చెప్పిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles