Manthani advocates seek CBI probe, fast-track court ఆయుధాలు, రక్తపు దుస్తులు సుంధిళ్ల బ్యారేజీలో..

Telangana lawyer couple murder accused throws knifes and clothes into sundilla barrage

Kunta Srinivas, DCP Ravinder, PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

The Manthani Bar Association wrote a letter to the Chief Justice of India as well as Telangana High Court Chief Justice, seeking a probe by CBI or an independent agency into the murder of lawyer couple Gattu Vaman Rao and Nagamani, implying that they had no faith in the investigation by the State police.

న్యాయవాదుల హత్య కేసు: ఆయుధాలు, రక్తపు దుస్తులు సుంధిళ్ల బ్యారేజీలో..

Posted: 02/24/2021 12:36 PM IST
Telangana lawyer couple murder accused throws knifes and clothes into sundilla barrage

తెలుగురాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారిన న్యాయవాద దంపతుల దారుణ హత్యకేసులోని నిందితులు అత్యంత పాశవికంగా హత్యలకు పాల్పడినా.. అసలేమీ జరగనట్లు అక్కడి నుంచి జారుకున్నారని.. ఆ రోజు రాత్రంతా కారులోనే నిద్రపోయారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మంథని న్యాయస్థానానికి సమర్పించిన నిందితులు రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బహిర్గతం అయ్యాయి. గుంజమడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను.. హైదరాబాదులో నివాసముండే అదే గ్రామానికి చెందిన న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన సతీమణి న్యాయవాది పివీ నాగమణిని కాల్వచర్ల సమీపంలో అత్యంత దారుణంగా హత్య చేశారు.

హత్య అనంతరం అక్కడి నుంచి సర్వసాధారణంగా ఏమీ జరగనట్లు కారులో మెళ్లిగా జారుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తులతో పాటు రక్తంతో తడిసిన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులోనే వాంకిడి చెక్ పోస్టు వద్దకు చేరుకున్న నిందితులు ఆ రాత్రి కారులోనే నిద్రపోయారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నారు. ఇక ఈ హత్యలు కేవలం వ్యక్తిగత కక్షల కారణంగానే జరిగిందని కూడా పోలీసులు ఈ నివేదికలో పేర్కోన్నట్లు సమాచారం.

కాగా ఈ మొత్తం వ్యవహరాంలో బిట్టు శ్రీను పాత్ర ఏమిటీ.? ఆయన ఆయుధాలను, కారును నిందితులకు సమకూర్చడంలో అంతరార్థం ఏమిటన్నది బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో తెలిసే అవకాశముంది. బిట్టు శ్రీనుకు మంథని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక హత్య జరిగిన రోజు నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుంట శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్ ల మధ్య మొత్తం 18 సార్లు ఫోన్ సంబాషణలు నడిచాయని పోలీసులు విచారణలో తెలింది. కుంట శ్రీనుకు బిట్టు శ్రీను మధ్య 11 సార్లు, కుంట శ్రీనుకు పూదరి లచ్చయ్యకు మధ్య ఐదు సార్లు కాల్స్ వెళ్లాయని గుర్తించిన పోలీసులు వారి మధ్య నడిచిన సంభాషణలను ఏమిటన్న విషయాలను కూడా తేల్చేపనిలో పడ్డారు.

అటు మరోవైపు న్యాయవాదలు వామన్ రావు, నాగమణిల జంట హత్యల కేసులో మంథని న్యాయవాదులు కూడా నిరసన బాట పట్టారు. ఈ కేసులో మంథని న్యాయవాదుల బార్ అసోసియేషన్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. న్యాయవాదుల కేసును సీబిఐ చేత విచారణ జరిపించాలని వారు కోరారు. లేని పక్షంలో స్వతంత్ర్య ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరారు. ఇక ఈ కేసు విచారణ నత్తనడకన సాగనీయకుండా న్యాయం కోసం చివరి వరకు పోరాడిన న్యాయవాదులకు అసలైన నివాళిని అర్పించడంలో భాగంగా కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని బార్ అసోసియేసన్ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lawyer Couple  Gattu Vaman Rao  PV Nagamani  Bittu Srinu  Kunta Srinivas  Telangana  crime  

Other Articles