Lawyer couple murder: HC issues notice to KCR govt సుమోటోగా న్యాయవాద దంపతుల హత్యకేసు స్వీకరించిన హైకోర్టు

Telangana high court takes suo motu cognizance of day light murder of lawyer couple

Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

A Division Bench of Justices Hima Kohli and Justice B. Vijaysen Reddy of Telangana High Court has taken suo motu cognizance on the murder of a lawyer couple near Hyderabad. A lawyer couple from Telangana, who had earlier complained of harassment in connection to the public interest litigations filed by them, was murdered in broad daylight.

న్యాయవాద దంపతుల హత్యకేసు: సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Posted: 02/18/2021 12:34 PM IST
Telangana high court takes suo motu cognizance of day light murder of lawyer couple

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. నడిరోడ్డుపై మిట్ట మధ్యాహ్నం జనసామర్థ్యం ఉన్న ప్రాంతంలో న్యాయవాదుల కారును అడ్డగించి కొబ్బరిబొండాలు నరికే కత్తులను చేతబూని.. న్యాయాన్ని సమాధి చేయాలన్న యోచనలో కరుడుగట్టిన నేరస్థుల ఆటవిక చర్యకు న్యాయవాది గట్టు వామన్ రావుతో పాటు ఆయన భార్య మహిళా న్యాయవాది పివి నాగమణిని బలైపోయారు. పట్టపగలు ప్రజలు చూస్తుండగా ఎలాంటి భయం లేకుండా అత్యంత పాశవికంగా న్యాయవాద దంపతులను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద ఆగంతకులు న్యాయవాద దంపతుల కారును అడ్డగించి వారిని బయటకు లాగి దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కో్హ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల కూడిన ధర్మాసనం.. న్యాయవాద దంపతుల హత్యోదంతం కేసును తాము సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. వీరి హత్య తమ దృష్టిలో వుందని పేర్కోంది. ఈ న్యాయవాద దంపతుల హత్యలపై నివేదిక తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది.

నిర్దిష్ట కాలపరిమితితో దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు అధికారులను సూచించిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి ఒకటికి వాయిదా పడింది. ఇదిలావుండగా ఈ హత్యలను నిరసిస్తూ హైకోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ రోజు అన్ని కేసుల విచారణను చేపట్టబోమని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles