WB Min Zakir Hussain critically injured in bomb attack మంత్రిపై బాంబులు విసిరిన అగంతకులు.. ఇద్దరు మృతి

West bengal minister jakir hossain critically injured in bomb attack

West Bengal Minister, Jakir Hossain, crude bomb attack, Jangipur Hospital, kolkata Hospital, two dead, critically injured, Nimtita Railway station, Raghunathganj, Murshidabad, West Bengal, crime

In a shocking incident in Murshidabad district, WestBengal minister Jakir Hussain was critically injured after crude bombs were hurled at him in Nimtita railway station. The incident happened at around 10 p.m. when Hussain was waiting to catch a train to Kolkata at platform number 2 of the station.

ITEMVIDEOS: మంత్రిపై బాంబులు విసిరిన అగంతకులు.. ఇద్దరు మృతి

Posted: 02/18/2021 11:32 AM IST
West bengal minister jakir hossain critically injured in bomb attack

దేశంలో నేరాలు, ఘోరాలు నానాటికి పెరుగుతున్నాయి. తన ప్రత్యర్థులను ఎదుర్కోనే విషయంలో చతికిలపడుతున్న వారు.. వారిని నేరుగా ఎదుర్కోనలేక.. దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై గుర్తు తెలియని అగంతకులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆయతో పాటు వున్నవారిలో ఇద్దరు మాత్రం అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కోల్ కతా నగరానికి వచ్చేందకు మంత్రి జాకీర్ హుస్సేన్ క్రితం రోజు రాత్రి 10 గంటల సమయంలో ముర్షిదాబాద్ జిల్లాలోని రఘునాథ్ గంజ్ పరిధిలోని నిమ్తితా రైల్వే స్టేషన్ లోకి చేరుకున్నారు. పలువురు అనుచరులు వెంటరావడంతో ఆయన తన ఫ్లాట్ ఫామ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని అగంతకలు ఆయనను టార్గెట్ చేసి నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో విస్పోటనం చోటుచేసుకుంది.

బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. విస్పోటనం ధాటికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కాగా తేరుకున్న తరువాత మంత్రి జాకీర్ హుస్సెన్ ఎక్కడా.. అని చూసిన రైల్వే సిబ్బందికి ఆయన రక్తపు మడుగులో చిక్కుకున్నారని చూపి హుటాహుటిన అసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత కోల్ కతా నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రితోపాటు ఉన్న మరో ఇద్దరు గాయపడగా వారు చికిత్స పోందుతూ మరణించారు. మంత్రి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister  Jakir Hossain  crude bomb attack  Nimtita Railway station  Murshidabad  West Bengal  crime  

Other Articles