Woman Escaped Being Crushed Under Moving Train కదులుతున్న రైలు కింద మహిళ.. తప్పించుకుందిలా..

Woman escaped being crushed under moving train in haryana

crossing the tracks, woman, train accident, viral videos, Railway Accident, Railway accident escape, Rohtak, Haryana, crime

A woman escaped being run over by a train yesterday simply by lying low on the track as the carriages passed above her. The incident took place in Rohtak district of Haryana and was witnessed by scores and captured on camera.

ITEMVIDEOS: కదులుతున్న రైలు కింద మహిళ.. తప్పించుకుందిలా..

Posted: 02/18/2021 01:25 PM IST
Woman escaped being crushed under moving train in haryana

రోడ్డుపై సరదాగా వెళ్తున్నా.. పక్కనున్న వాహనదారులను ఇబ్బందుల పాటు చేసేలా రయ్ రయ్ మంటూ విపరీతమైన స్పీడుగా వెళ్తే కాని మన యువతకు కిక్ ఎలా రాదో.. అదే విధంగా ఇంటికి వెళ్లి.. చేయాల్సిన పెద్దగా పనులు లేకపోయినా.. చుట్టుపక్కల వారితో ముచ్చట్లకే గంటలు గడిపినా పర్వాలేదు కానీ.. రైల్వే గేటు వేసివుంటా దాని కింద నుంచి ఎలా వెళ్లాలనేదానిపై మాత్రం మనవాళ్లుకు వుండే తొందర అంతాఇంతా కాదు. ఇక పోరబాటునో గ్రహపాటునో రైల్వే గేటుకు అడ్డంగా రైలు నిలిచిపోతే.. దాని కింద నుంచి ఎలా వెళ్లాలా అని అలోచించేవాళ్ల సంఖ్య కూడా గణనీయంగానే వుంది.

నమ్మశక్యంగా లేదా..? ఇప్పుడు మీరు చదవబోతున్నది అదే తరహాకు చెందిన ఓ ఘటన. పిల్లలకు బుద్దులు చెప్పే వయస్సులోనే ఓ నడివయస్సులోని మహిళ.. ఆగి వున్న రైలు కింద నుంచి అటు నుంచి ఇటు రావాలని ప్రయత్నించింది. అంతే అదే సమయంలో రైలుకు సిగ్నల్ లభించడంతో ఒక్కసారిగా రైలు ముందుకు కదిలింది. అంతే అమెకు గుండె అగినంత పనైంది. అయితే పక్కనే వున్న కొందరు అమెకు కిందపడుకోవాలని, రైలు వెళ్లేంత వరకు అమెను కదలకూడదని సూచించారు. దీంతో వారి సూచనలు పాటించింది. ఇప్పుడా వీడియోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్ తక్ నగరంలోని రైల్వే గేటు వద్ద ఓ రైలు సిగ్నల్ లభించక ఆగివుంది. దీంతో కొంత సమయం అక్కడే అగి చూసినా అది కదిలేలా కనిపించలేదు. దీంతో ఇక ఒపిక నశించిన మహిళ.. దాని కింద నుంచి అటు వైపు నుంచి ఇవతలకు రావాలని ప్రయత్నించింది. ఇంతలో రైలుకు సిగ్నల్ లభించడంతో అది కాస్తా అకస్మాత్తుగా ముందుకు కదిలింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మహిళ మదిలో భయం రాజ్యమేలుతోంది. అంతలో చుట్టుపక్కల వున్నవారు అమెకు కింద కదలకుండా పడుకోవాల్సిందిగా సూచించారు.

దీంతో రైలు తనపై నుంచి వెళ్లేవరకు మహిళ పట్టాల మధ్య కదలకుండా పడుకుంది. దీంతో అమె ప్రాణాలను నిలిచాయి. రైలు వెళ్లగానే పక్కనే వున్న కొందరు అమెను లేపి సాయాన్ని అందించారు. అయితే తనకేమీ జరగనట్టు మహిళ తన కోసం వేచి వున్న ఇతర మహిళలతో కలసి వెళ్లింది. ఈ ఘటనపై స్థానిక రైల్వే గేటు గార్డు మాట్లాడుతూ తాను రైలు కింద నుంచి గేటు కింద నుంచి వెళ్లవద్దని అందరికీ చెబుతూనే వుంటానని.. అయినా తన మాట లక్ష్యపెట్టకుండా వారు తామిష్టమంటూ దాటుతుంటారని తాను వారిని ఎలా నిరోధించగలనని ప్రశ్నించారు. కాగా గత సెప్టెంబర్ లో ఇలాగే రెండేళ్ల బుడతడు రైలు కింద పడి సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles