ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం రోజునే పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేసిన ఆయన ఆ తరువాత గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టరల్తో పాటు తిరుపతి అర్భన్ ఎస్సీని వెంటనే బదిలీ చేయాలని అదేశాలు జారి చేశారు. ఆయన అదేశాలపై నిన్నటి వరకు దూరంగా వ్యవహరించిన రాష్ట్రప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు నేపథ్యంలో వేగంగానే స్పందిస్తోంది.
పంచాయతీ ఎన్నికల విధుల నుంచి గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో పాటు తిరుపతి అర్భన్ ఎస్సీని దూరంగా వుంచుతూ తాజాగా అదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వీరు సాధారణ పరిపాలన బాధ్యతలను చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గుంటూరు కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్భన్ ఎస్పీ రమేష్ రెడ్డీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు పిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డి మార్కండేయులు జిల్లా ఎన్నికల అధికారులుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇటు చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ కూడా అర్భన్ ఎస్పీగా బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఇక రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శఇ గోపాలకృష్ణ ద్వివేదీ, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ గిరిజా శంకర్ లను కూడా బదిలీ చేస్తూ.. వారిపై అభిశంసన ప్రోసీడింగ్ ఇచ్చారు నిమ్మగడ్డ. రాష్ట్ర ఎన్నికల కమీషన్ అదేశాలను పాటించడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారని, వీరి వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్దం కాలేదని, అందుకు తీసుకోవాల్సిన చర్యలను వీరు చేపట్టకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర యువత ఓటు హక్కును కోల్పోడానికి ఈ ఇద్దరే ముఖ్యకారణమని ఆయన తన అభిశంసనలో పేర్కోన్నారు. ఈ అభిశంసనలను వారి సర్వీసు రికార్డుల్లోనూ చేర్చాలని అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more