Phone numbers of 500 million Facebook users on sale అమ్మకానికి 60 లక్షల మంది పేస్ బుక్ యూజర్ల ఫోన్ నెంబర్లు

Phone numbers of over 60 lakh indian facebook users reportedly on sale on telegram

Facebook, telegram bot, Facebook security breach, facebook users number sold, facebook telegram, Telegram bot, Facebook, security breach, Facebook privacy, Alog Gal, Facebook users data, Indians phone numbers facebook, facebook privacy india, india Twitter, facebook whatsapp

In an apparent security breach, mobile phone numbers of over 500 million Facebook users are up for sale through a Telegram bot. According to security researcher Alon Gal (via Motherboard) the data includes phone numbers of over 60 lakh Indian users. The problem was first highlighted by Gal on microblogging site Twitter.

అమ్మకానికి 60 లక్షల మంది పేస్ బుక్ యూజర్ల ఫోన్ నెంబర్లు

Posted: 01/27/2021 02:36 PM IST
Phone numbers of over 60 lakh indian facebook users reportedly on sale on telegram

ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్ ను వినియోగించే దాదాపు 60 లక్షల మంది భారతీయలకు మాత్రం తాజాగా నిద్రను కరువయ్యేలా చేస్తోంది. ఎందుకంటే వారి ఫోన్ నెంబర్లను.. టెలిగ్రామ్ యాప్ లో అమ్మకానికి పెట్టారన్న వార్త భారతీయ ఫేస్ బుక్ యూజర్లను అందోళనకు గురిచేస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహించే సైబర్ నిపుణుడు అలొన్ గాల్ ఈ మేరకు వెల్లడించారు.

ఫేస్ బుక్ పెట్టిన సెక్యూరిటీ వలయాన్ని చేధించిన ఓ సైబర్ దుండగుడు.. అందులో వున్న చిన్న లోపాన్ని అసరాగా చేసుకుని పేస్ బుక్ ఖాతాదారులుగా వున్న భారతీయ యూజర్ల నెంబర్లను తస్కరించి.. వాటిని టెలిగ్రామ్ యాప్ లోని అమ్మకానికి పెట్టాడని తెలిపారు. ఈ దుండగుడి వద్ద ఏకంగా 533 మిలియన్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారంతో పాటు వారి ఫోన్ నెంబర్లు కూడా వున్నాయని అలొన్ గాల్ తెలిపారు. అయితే ఈ విధంగా సమాచార తస్కరణ 2019కి ముందే జరిగిందని చెప్పారు. 2019లో ఈ లోపాన్ని గుర్తించిన ఫేస్ బుక్.. దానిని సరి చేసిందని కూడా గాల్ తెలిపారు.

కాగా ఫేస్ బుక్ యూజర్లతో పాటు వారి ఫోన్ నెంబర్లు సేకరించిన దుండగుడు వాటిని టెలిగ్రామ్ లో ఓ బాట్‌ ద్వారా అమ్మకానికి పెట్టారు. వీటిల్లో 60 లక్షల మంది భారతీయుల సమాచారం కూడా ఉందని గాల్ తెలిపారు. సదరు హ్యాకర్‌ సోషల్‌ మీడియా ఖాతాలు.. వాటి ఫోన్‌ నెంబర్లతో ఓ డేటాబేస్‌ తయారు చేసి వాటిని విక్రయిస్తున్నాడని అలొన్‌ వెల్లడించారు. ఈ డేటాబేస్ తో  వ్యక్తి ఫేస్ బుక్‌ ఖాతా సాయంతో అతని ఫోన్ నెంబర్‌ కనిపెట్టవచ్చు. దీంతో ఒక్కో ఖాతా ఫోన్‌ నెంబర్‌ తెలుసుకోవడానికి 5 డాలర్లు.. అదే పెద్దమొత్తంలో డేటా తెలుసుకోవాలంటే 5వేల డాలర్లు ధరను ఆ హ్యాకర్‌ నిర్ణయించాడు. ఈ డేటాను జనవరి 12 నుంచి విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  telegram bot  facebook users number sold  facebook telegram  

Other Articles