Over 300 Police men injured in tractor rally violence ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత.. ఎర్రకోటను ముట్టడించిన కర్షకులు

Over 300 delhi police personnel injured in tractor rally violence

farmers protest, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, Intelligence bureau, farmers turn violent, farmers rally deviated, farmers ram leela maidan, supreme court committee, delhi, politics

Rapid Action Force has been deployed at Red Fort. During tractor parade on Tuesday, tens of thousands of protesters broke through barriers, fought with police, overturned vehicles and hoisted a religious flag from the ramparts of the iconic Red Fort.

ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత.. ఎర్రకోటను ముట్టడించిన కర్షకులు

Posted: 01/27/2021 12:17 PM IST
Over 300 delhi police personnel injured in tractor rally violence

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నూతన చట్టాల ఉపసంహరణను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతు సంఘాలతో కేంద్రం పది పర్యాయాలు చర్చలు జరిపినా.. అవి ఫలప్రదం కాలేదు. వెన్నులో వణుకు పుట్టించే చలిలోనూ రైతులు మొక్కవోని ధైర్యంతో నిరసన దీక్షలను చేపట్టారు. పలువురు రైతులు చలికి తట్టుకోలేక అసువులు బాసినా.. మరికోందరు ఆత్మహత్యలు చేసుకున్నా.. వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోని కేంద్రం.. కనీసం రైతులకు చలి నుంచి రక్షణ పోందేలా కూడా చర్యలు తీసుకోలేదు.

ఇక చర్చల పేరుతో జాప్యం చేస్తూ ఏకంగా మూడు నెలలుగా రైతులు తమ గ్రామాలు, పోలాలు, పాడి పంటలు వదిలేసి వచ్చినా.. అత్యవసరంగా చర్చించాల్సిన అంశాన్ని తాత్సరం చేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఈ నెలలో చేపట్టిన చర్చలు విఫలమైన నేపథ్యంలో వారు టాక్టర్ ర్యాలీ నిర్వహించి.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఇక గణతంత్ర దినోత్సవం రోజున తమ తడాఖా చూపిస్తామని రైతులు చెప్పినా.. కేంద్రం వారిలోని ఆగ్రహాన్ని.. వారి వ్యూహాన్ని పసిగట్టలేకపోయింది. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని వారు ముందస్తుగానే అనుమతులు కూడా తీసుకున్నా.. పోలీసులు వారికి నిర్ధేశించిన మార్గాన్ని వదలి.. వ్యూహాత్మకంగా రామ్ లీలా మైదనానికి చేరుకున్నారు.

అటు నుంచి ఎర్రకోటకు చేరుకుని ఇకపై ఇదే తమ అందోళనస్థలి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు ఎర్రకోటపై రైతులు సిక్కుల జెండాతో పాటు రైతు సంఘాల జెండాను కూడా ఎగరేసి సంచలనం సృష్టించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతుల చర్యలు యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేశాయి. రైతుల హెచ్చరికలను అంచనా వేయడంలో అటు పోలీసులు, ఇటు ఇంటెలిజెన్స్ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి. ఓ వైపు దాయాది దేశానికి చెందిన పలు ఉగ్రవాద మూకలు రైతు సంఘాల అందోళనలో చేరాయని అనుమానిస్తున్నా.. వాటిని నియంత్రించే చర్యలను తీసుకోవడంలో మాత్రం కేంద్రబలగాలు, ఢిల్లీ పోలీసులు విఫలమయ్యార్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతుల చర్యలతో బిత్తరెపోయిన పోలీసులు.. బలగాలను మోహరించి.. ఎర్రకోటలోని కర్షకులను అక్కడి నుంచి తరమివేసింది. ఇక వారిని ఢిల్లీ సరిహద్దులకు తరలించేందుకు చర్చలు చేపట్టింది. దీంతో దేశరాజధాని వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, అయితే రైతులు మాత్రం మూడు నెలలుగా ఢిల్లీ శివార్లలో వుంటూ నిరసన తెలిపామని, ఇకపై ఢిల్లీనే తమ నిరసన దీక్షస్థలిగా మార్చుకుంటామని తెల్చిచెబుతున్నాయి. ఇకపై ఢిల్లీని వదిల వెళ్లబోమని తెలిపాయి. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. అటు మెట్రో రైలు సర్వీసులపై కూడా ఆంక్షలను కొనసాగుతున్నాయి, ఇక రైతుల సంఘాలతో సుప్రీం నియమించిన కమిటీ సమావేశం కూడా ఇవాళ జరగాల్సి వున్నా దానిని కూడా 29కి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh