Old notes of Rs 100, 10 and 5 to be demonetised? రూ. 100, పది, ఐదు నోట్ల రద్దుపై స్పష్టతనిచ్చిన ఆర్బీఐ

Rbi clarifies on withdrawing old rs 100 rs 10 rs 5 notes

RBI, rbi to ban old 100 rupee notes, note ban rbi, demonetisation of small notes, rbi on note ban, banknotes, RBI on small notes ban, RBI on Old currency ban, Reserve bank of india, demonetisation, bank notes, Rs 100, Rs 10 bank note, banknote, bank note, central bank, atm, economics

Reserve Bank of India today said that reports surrounding the withdrawal of old series of some banknotes are incorrect, putting to rest rumours that had been circulating. Taking to Twitter, the Reserve Bank of India said, “With regard to reports in certain sections of media on withdrawal of old series of Rs 100, Rs 10, and Rs 5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.”

రూ. 100, పది, ఐదు నోట్ల రద్దుపై స్పష్టతనిచ్చిన ఆర్బీఐ

Posted: 01/25/2021 08:02 PM IST
Rbi clarifies on withdrawing old rs 100 rs 10 rs 5 notes

2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు, పరిమితులు మధ్య ప్రజలకు కరెన్సీని అందించారు. దీంతో గంటల కోద్ది సమయం, రోజులకు రోజులు ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కట్టిన ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు అందరికీ గుర్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోమారు నోట్ల రద్దుకు కేంద్రం పూనుకుంటుందని అటు సోషల్ మీడియా, ఇటు మీడియాలో వార్తలు పెను సంచలనంగా మారాయి. దీంతో సామాన్యులలో అందోళన రేకెత్తుతోంది.

ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ లోపు పాత చిన్న నోట్లను రద్దు చేస్తారన్న వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. సామాజిక మాద్యమాలతో పాటు మీడియాలోని ఓ వర్గంలో కూడా ఈ వార్తలు ప్రచురించాయి, దీంతో సామాన్యులలో అందోళన రేకెత్తున్న తరుణంలో ఈ అంశంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ నిజనిర్థారణ బృంధం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక వాస్తవాన్ని ప్రజలకు చేరవేసింది. పాత చిన్న నోట్ల రద్దును చేపడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని, ఈ తరహా వార్తలను విశ్వసించరాదని పేర్కోంది.

పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను రద్దు చేస్తున్నారన్న వార్త సత్య దూరమని స్పష్టతను ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 2018లో కొత్త రూ.10, రూ. 50, రూ.200 నోటును ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత 2019లో కొత్త రూ.100 నోటును కూడా చలమణిలోకి తీసుకువచ్చింది. లావెండర్ వర్ణంలో వున్న ఈ కొత్త రూ. 100 నోట్లపై గుజరాత్ రాష్ట్రంలోని యూనెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రాణికి వావ్ ను ముద్రించింది. దీంతో 900 సంవత్సరాల పురాతన నిర్మాణ అద్భుతంతో సహా నీటి పవిత్రతను కూడా ప్రదర్శిస్తూ వుంది, ఈ కొత్త నోటును చలామణిలో తీసుకురావడంతో పాత నోట్లు పై ప్రచారం జోరందుకుంది. కాగా ఈ ప్రచారంలో నిజంలేదని తేల్చిచెప్పింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని భారతీయ రిజర్వు బ్యాంకు ట్విట్టర్ ద్వారా  వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles