mudragada letter to SEC Nimmagadda on local body elections ఏదో అదృశ్య శక్తి ఉందంటూ.. నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ..

Mudragada padmanabham letter to sec nimmagadda on local body elections

Nimmagadda Ramesh, Muddragada Padmanabham, SEC, Gram Panchayat Elections, local body polls, COVID-19 vaccine, Corona vaccine, Andhra Pradesh government, Andhra Pradesh, politics

AP former Kapu JAC Leader Mudragada Padmanabham Writes an open letter to SEC Nimmagadda on local body elections alleging that some unseen power is behin the state election officer pressuring him to conduct the gram panchayat elections.

ఏదో అదృశ్య శక్తి ఉందంటూ.. నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ..

Posted: 01/25/2021 02:14 PM IST
Mudragada padmanabham letter to sec nimmagadda on local body elections

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నికలు జరుగుతాయా.? లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా సస్పెన్ కోనసాగుతోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎవరి పక్షాన తీర్పును వెలువరిస్తోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలగా వుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్నికలలో పాల్గోనబోమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలను నిర్వహించాల్సిన అవశ్యకత ఏమీటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు కరోనా వాక్సీన్ ను ప్రజలకు అందించాల్సిన అత్యవసర పరస్థితులు నెలకొన్న తరుణంతో ఉద్యోగులు అందుకు సిద్దమవుతున్న తరుణంలోనే పంచాయతీ ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి.. తమ జీవితాలతో ఆటలాడే అధికారం నిమ్మగడ్డకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కాపు హక్కుల వేదిక నాయకుడు ముద్రగడ ప్రద్మనాభం ఓ లేఖను రాయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి వెనుక ఏదో తెలియని అదృశ్య శక్తి ఉందని, అదే ఎన్నికలపై ఆయనను ఒత్తిడి చేస్తోందని అన్నారు.

ఆయన లేక సాగిందిలా.. "మీ నిర్ణయాల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉండి నడిపిస్తున్నట్టుంది. ఎన్నికల కమిషన్ ఇంత పట్టుదలతో అడుగులు వేస్తుండటాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. ఎవరి ప్రోద్బలంతోనో మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి మొండి పట్టుదల తగదని భావిస్తున్నాం. కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గి, ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించిన తరువాత ఎన్నికలు జరపించడానికి అభ్యంతరాలేంటి?" అని తన లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. ఇక ఇలాంటి ప్రశ్నలను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, అధికార పార్టీ వర్గాలు లేవనెత్తిన తరుణంలో ముద్రగడ కూడా అలాంటి ప్రశ్నలే సంధించడం దుమారం రేపుతోంది.

ఇక ఇవాళ్టి నుంచి తొలి ధశ నామినేషన్ల ప్రక్రియకు తెర లేచిన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు మాత్రం ఏక్కడ జరగలేదని తెలుసుకున్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ఇవాళ ఉదయాన్నే కార్యాలయానికి విచ్చేశారు. నామినేషన్ల పర్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఈ క్రమంలో మైనారిటీ తీరిన వారికి కూడా ఓటు హక్కు కల్పించిన తరువాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh