Six killed in Indianapolis mass shooting అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. గర్భణి సహా అరుగురు మృతి

5 people including pregnant woman killed in indianapolis mass shooting

mass murder, murder, multiple homicides, Indianapolis, 6 killed, 1 juvenile hospitalized, juvenile hospitalized, Indiana, Ind, Joe Hogsett, Randall Taylor, Indianapolis Metropolitan Police Department, city's largest mass casualty shooting in more than a decade, mass casualty shooting, targeted, Kezzie Childs, Raymond Childs Jr., Elijah Childs, Rita Childs, Kiara Hawkins, Baby boy Hawkins, pregnant woman, unborn child, unborn son, crime

Five people are dead following a mass shooting in Indianapolis. One of the people killed was pregnant – the woman's unborn child was also killed. A boy, who suffered a gunshot wound, was taken to a nearby hospital and is expected to survive, police said.Indianapolis Metropolitan Police Department Chief Randall Taylor called the incident the city’s "largest mass casualty shooting in over a decade."

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. గర్భణి సహా అరుగురు మృతి

Posted: 01/25/2021 12:07 PM IST
5 people including pregnant woman killed in indianapolis mass shooting

అగ్రరాజ్యంలో ఎందరు అధ్యక్షులు మారినా అక్కడి ప్రజల్లో తుపాకీ సంస్కృతిని నియంత్రించే అంశంలో మాత్రం మార్పు తీసుకురాలేకపోతున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ విషయంలో ఏదో చేయాలని తాను అనుకున్నా.. చివరకు ఎనమిదేళ్ల పదవీ కాలంలో ఏమీ చేయలేక దిగిపోయారు. ఈ మేరకు ఆయన తన నిస్సహాయతను కూడా వెలుబుచ్చారు. కానీ గన్ కల్చర్ లో మాత్రం మార్పును తీసుకురాకపోతే అమెరికాలో మనుషుల ప్రాణాలకు దినదిన గంగం తప్పదన్న అవేదనను, అందోళనను ఆయన తన పదవీ కాలం ముగుస్తున్న సమయంలో వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఎందుకంటే అక్కడ ఎవరు పడితే వారు తుపాకీని పట్టుకెళ్లే స్వతంత్రం, స్వేఛ్చా వున్నాయి. ఓ ఇండో అమెరీకన్ అధ్లెట్, సైంటిస్ట్ సహా ఎందరో భారతీయులు ఈ తుపాకీ కల్చర్ కు బలైపోయారు. అంతేకాదు ఎందరో అమాయక అగ్రరాజ్యవాసులు కూడా తమ దేశంలోని ఈ సంస్కృతికే బలైయ్యారు, ఇప్పటికీ బలవుతునే వున్నారు. తాజాగా అమెరికాలో తుపాకీ సంస్కృతి మ‌రో ఆరుగురి ప్రాణాలను బలిగొనింది. ఓ ఇంట్లోకు చోరబడిని ముష్కరులు.. తుపాకులతో విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ను ఇండియానా పోలిసు మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ దారుణ ఘ‌ట‌న‌పై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించార‌ని వివరించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌నలో మ‌రో మైన‌ర్ కి తీవ్ర‌గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంద‌ని పోలీసులు వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆ మైన‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. అడ‌మ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు వివ‌రించారు. దుండ‌గుడు ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండ‌గుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mass shooting  multiple homicides  indianapolis  gun culture  America  United states  Crime  

Other Articles