ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటీషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను యధావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై విచారించిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని రెండు విభిన్న అధికారాల మధ్య పంచాయతీ ఎన్నికల సమస్య తలెత్తడానికి తమ మాట గెలిచి తీరాలన్న పంతం ఉతన్నమైందని, దీంతో రాష్ట్రంలో చట్టబద్దత లోపించడానికి కారణంగా మారుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అధికారాల మధ్య పంతంలో తాము భాగం కాదల్చుకోలేదని పేర్కోంది.
విచారణ సంరద్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు, పంచాయతీ రాజ్ అధికారులు ఎలా తీర్మాణాలను చేస్తారని, వాటిని ఎలా అమోదిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమస్య ఉత్పన్న కావడం వెనుక మరేదో కారణం వుందని అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాలకు పలు బాధ్యతలు వుంటాయని, వాటిన్నింటి నిర్వహణను తాము తీసుకోలేమని చెప్పింది. ఎన్నికల నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, అది వారే చేయాలని న్యాయస్థానం పేర్కోంది.
కాగా కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని.. వాక్సినేషన్ డ్రైవ్ ఫిబ్రవరి 28 నాటికి పూర్తైన తరువాత మార్చిలో నిర్వహించుకోవచ్చునని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కారణంగా వెలువరించకుండా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన హైకోర్టు సింగిల్ జడ్జీ తీర్పును మీరు సమర్ధిస్తున్నారా.? అంటూ న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది. ఇక కరోనా సమయంలోనే పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయని, ఇక వాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల వాయిదా సముచితం కాదని ధర్మాసనం పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more
Mar 03 | రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ... Read more
Mar 03 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన... Read more
Mar 03 | ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి... Read more
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more