Vizianagaram SP on TDP Kala Venkata Rao arrest కళా వెంకట్రావును అరెస్టు చేయలేదు: విజయనగరం ఎస్పీ

Vizianagaram sp b rajakumari on tdp kala venkata rao arrest

SP Rajakumari, Kala Venkata Rao, arrest, former TDP state President, investigation, RamaTheerdham, MP Vijaya Sai Reddy, localites, YSRCP, TDP, Vizianagaram, Crime

Vizianagaram SP B Rajakumari Clariffied on TDP Kala Venkata Rao arrest, says the former AP TDP President is not arrested but was called up for the investigation in RamaTheerdham incident case, Where the YCP MP Vijaya Sai Reddy was attacked by the local people with slipper and stones.

కళా వెంకట్రావును విచారణకు పిలిచాం.. అరెస్టు చేయలేదన్న జిల్లా ఎస్పీ

Posted: 01/21/2021 12:33 PM IST
Vizianagaram sp b rajakumari on tdp kala venkata rao arrest

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై ఆయనను విచారణకు మాత్రమే పిలిచామని అయితే ఆయన మూడు పర్యాయాలు పోలీసులు పిలిచినా రాకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు వెళ్లి తీసుకువచ్చారని తెలిపారు. ఆ రోజులన ఏం జరిగిందన్న విషయమై ఆయన నుంచి వాంగ్మూలం తీసుకన్న తరువాత ఆయనను వ్యక్తిగత పూచికత్తుపై పోలీసులు విడిచిపెట్టారని అమె తెలిపారు. అంతేకానీ అరెస్టు పర్యాలు కోనసాగిన కథనాలు వాస్తవ దూరమని అన్నారు.

రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన నెల్లిమర్ల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం.. అంతకు ముందు ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించడం కూడా ఆయనను అరెస్టు చేశారన్న వార్తలకు బలం చేకూరింది. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆయన బోజనానికి ఉపక్రమించే సమయానికి చేరుకున్న నెల్లిమర్ల పోలీసులు.. ఆయనను నెల్లిమర్ల నుంచి చీపురుపల్లికి తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థంలో పర్యటించిన సమయంలో అక్కడికే వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి జరిగిన ఘటనపై విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయనను విడిచిపెట్టారు.

రామతీర్థం ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కళా వెంకట్రావుపైనా కేసు నమోదు చేశారు. ఇక ఆయనను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో రాజాంలో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి, టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు ఒక్కసారిగా కళా వెంకట్రావు ఇంటి ఆవరణకు చేరుకున్నారు. అటు టీడీపీ కూడా అక్రమ అరెస్టులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించి.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా తెరలేపింది. దీంతో అర్థరాత్రి సమయంలో కళా వెంకట్రావును విడిచిపెట్టిన పోలీసులు.. ఆయనను కేవలం విచారణ నేపథ్యంలోనే పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లామని, ఆనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశామని చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SP Rajakumari  Kala Venkata Rao  arrest  RamaTheerdham  MP Vijaya Sai Reddy  YSRCP  TDP  Vizianagaram  Crime  

Other Articles