ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని అదేశాలను వెలువరించింది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన తరుణంలో హైకోర్టు సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. షెడ్యూల్డు విడుదలైన నాటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన ఎన్నికల పంచాయితీకి హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రజాస్వామ్యం పరిరక్షణ కూడా ముఖ్యమన్న న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశాన్ని కూడా ముఖ్యమైనదిగానే పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని.. అందుకు అనుగూణంగా మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రభుత్వం సమన్వయం చేసుకుని ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్ న్యాయవాదులు ఇటీవల వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితమే విచారణను ముగించి, ఇవాళ తీర్పును వెలువరించింది.
దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 23న వెలువరించనున్నట్లు కూడా తెలిపింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కష్ట సాధ్యమని, కరోనా వాక్సీనేషన్ డ్రైవ్ కొనసాగుతున్న సమయంలో ఆఘమేఘాల మీద ఎన్నికల నిర్వహించాల్సిన అవసరం లేదని సర్కార్ అభిప్రాయపడుతోంది. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more