US democracy has prevailed; Joe Biden అగ్రరాజ్యాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి: జో బైడెన్

My whole soul is in uniting america says biden after taking oath

US President Joe Biden, Joe Biden Takes Oath, 46th president of United States, US President Joe Biden swearing in ceremony, US President Joe Bidenfirst speech, american president, joe biden, kamala harris, 49th vioe-president of United States, corona virus, capital building, swreaing in ceremony, America, US

Joe Biden became the 46th president of the United States with a call to unity, vowing to bridge deep divides and defeat domestic extremism two weeks after a mob attack tried to undo his election victory.

అగ్రరాజ్యాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి: నూతన అధ్యక్షుడు జో బైడెన్

Posted: 01/21/2021 11:41 AM IST
My whole soul is in uniting america says biden after taking oath

అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన అమెరికాన్ కాంగ్రెస్ లో అడుగుపెట్టనున్నారు. అమెరికా దేశ చరిత్రలో అత్యంత పెద్ద వయస్సుడైన అధ్యక్షుడిగా జో బైడెన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి.. అధికారం కోసం కాకుండా అమెరీకన్ల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం విలువైనది, సున్నితమైనదని మరోమారు అమెరికన్ ప్రజలు నిరూపించారన్నారు.

ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, తద్వార ప్రజాసంకల్పం నెరవేరిందని అన్నారు. క్యాపిటల్ భవన పునాదులను కదిలించే ప్రయత్నాలను.. ప్రజలు ఏకతాటిపై నిలిచి దేశసమగ్రతను చాటారని బైడన్ అన్నారు. గత నాలుగేళ్లులో అంతర్జాతీయ సమాజంతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్దరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు, ఈ బాద్యతలతో పాటు అమెరికాను అగ్రగామిగా నిలపడంలోనూ ప్రజలు తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. తాను అందరినీ సమానంగానే పరిగణిస్తానని, అధ్యక్ష పదవికి రాజకీయాలు వుండరాదని తెలిపారు. దేశ ప్రజల అభ్యున్నతికి, దేశం ప్రగతికి పాటుపడతానని అందుకు ప్రజలందరీ సహకారం కావాలని కోరారు,

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భారత సంతతికి చెందిన కమలా హారీస్ ప్రసంగిస్తూ.. రాజ్యాంగంపై నిజమైన నమ్మకం, విధేయత, కలిగివుంటానని అన్నారు, తన విధిని స్వేచ్ఛగా స్వీకరిస్తానని, విదేశీ, స్వదేశీ శత్రువల నుంచి దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడతానని అన్నారు, దేశ ఉపాధ్యక్షురాలిగా తన పదవిని బాధ్యతతో నిర్వహిస్తానని ప్రమానం చేస్తున్నట్లు చెప్పారు, ఈ బాధ్యతలను తాను నిర్వహించేందుక దేశ ప్రజలతో పాటు భగవంతుడి సహకారం కూడా కావాలని అమె అన్నారు. కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కేవలం వెయ్యి మంది అతిధుతు మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామా-మిచెల్, బిల్ క్లింటన్-హిల్లరీ, జార్జ్ డబ్ల్యూ బుష్-లారా దంపతులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles