AAP enters Maha rural politics, wins 96 seats మహా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్..

Maharashtra gram panchayat elections aap wins 96 seats 41 in yavatmal

Maharashtra Panchayat election results, Pune news, AAP Wins Maharashtra Gram Panchayat, AAP results in Gram Panchayat, AAP in Rural Maharashtra, AAP wins Nagpur Gram Panchayat, AAP wins Latur Gram Panchayat, Nashik Gram Panchayat Results, Ahmednagar Gram Panchayat Results, Maharashtra, Politics

Tasting electoral success for the first time in Maharashtra, Aam Aadmi Party-backed candidates won 96 seats in the state gram panchayat polls, the results for which were announced. The AAP-backed candidates had contested in 300 seats in 13 districts of Maharashtra.

మహా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్.. 96 స్థానాలు కైవసం

Posted: 01/21/2021 10:47 AM IST
Maharashtra gram panchayat elections aap wins 96 seats 41 in yavatmal

దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్ లో ఉనికి చాటుకున్నా.. అది కేవలం పట్టన ప్రాంతాలకు మాత్రమే పరిమితం య్యింది. కాగా ఇక తాజాగా దేశ అర్థిక రాజధాని వుండే ముంబై వుండే మహారాష్ట్రలోనూ సత్తా చాటింది. చాప కింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అప్ తన ఉనికి చాటుకోగలిగింది. పలు జిల్లాల్లో మాత్రం గణనీయమైన సంఖ్యలోనే స్థానాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 96 సీట్లు సాధించి సత్తా చాటింది.

మహారాష్ట్రలో ఎన్నికలలో తొలిసారి అందులోనూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అప్ క్షేత్రస్థాయిలోనే పార్టీని బలోపేతం చేసి ఉనికి చాటుకుంటూ ఖాతా తెరిచింది. విజయం సాధించిన 96 స్థానాల్లో 41 స్థానాలను ఒక్క యవత్మాల్ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం. మొత్తంగా 13 జిల్లాల్లోని 300 స్థానాలకు ఆప్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా బరిలోకి దింపిన అభ్యర్థులలో మూడింట ఒక వంతు అభ్యర్థులను ప్రజలు విజేతలుగా నిలిపారు. లాతూర్, నాగ్ పూర్, షోలాపూర్, నాశిక్, గోండియా, చంద్రాపూర్, పాల్ఘర్, హింగోలి, అహ్మద్ నగర్, జల్నా, యవత్మాల్, పర్భానీ జిల్లాల్లో గెలుపు ఖాతా తెరిచింది. రాజకీయాలతో సంబంధం లేని సంఘాలతో జట్టు కట్టి మరో 13 స్థానాలను కైవసం చేసుకుంది.

వచ్చే ఏడాది రానున్న బృహన్ ముంబై  (గ్రేటర్ ముంబై) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కు ఈ ఎన్నికలు మంచి జోష్ ను ఇచ్చాయి.  కాగా, 34 జిల్లాల్లోని 14 వేల గ్రామపంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అయితే, 3,276 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. అయితే, తాము 6 వేలకుపైగా పంచాయతీలను గెలిచామని, తామే అతిపెద్ద పార్టీ అని బీజేపీ ప్రకటించుకుంది. మహా వికాస్ అఘాడీలోని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ లు కలిపి గెలిచిన స్థానాల్లో 20 శాతం కూడా బీజేపీ గెలవలేదని పాటిల్ అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన వారిలో లక్షా 25 వేల మంది అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles