Sanjay Raut Confirms Sena Joining Fight For Bengal పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో శివసేన: సంజయ్ రౌత్

Shiv sena will contest west bengal assembly elections 2021 says sanjay raut

Shiva Sena West Bengal, Shiva Sena to contest West Bengal Assembly Elections, Shiva Sena in Bengal, Bengal Shiva Sena, Shiv Sena will contest West Bengal elections, Shiva Sena West Bengal candidates, Shiva Sena West Bengal news, West Bengal Assembly Elections 2021, Bengal elections, 2021 Bengal elections, Bengal polls, west bengal, west bengal politics, Shiv Sena, Shiv Sena to fight West Bengal elections, Sanjay Raut, Shiv Sena leader, Shiv Sena news, Sanjay Raut tweet, Sanjay Raut Twitter

Shiv Sena spokesperson Sanjay Raut announced that the party will contest the upcoming West Bengal Assembly Elections. Raut said the decision to contest the 2021 West Bengal polls was taken after holding discussions with Maharashtra Chief Minister and Shiv Sena president Uddhav Thackeray.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో శివసేన: సంజయ్ రౌత్

Posted: 01/18/2021 03:17 PM IST
Shiv sena will contest west bengal assembly elections 2021 says sanjay raut

(Image source from: Twitter.com/ANI)

మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని మరో బలమైన పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) తరహాలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతోంది, ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపిన శివసేన పార్టీ రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తాజాగా స్పష్టత నిచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నట్టు శివసేన ప్రకటించింది.

ఈ మేరకు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సామాజిక మాద్యమం ద్వారా వెల్లడించారు, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం తన అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తాము పోటీ చేయనున్నామని పేర్కోంటూ అటు పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు మీడియాతో పంచుకున్నారు, ఇదిలావుండగా, 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన శివసేన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికలలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపిన పార్టీ డిపాజిట్లు సైతం రాబట్టుకోలేని పరిస్థితిల్లోకి జారుకుంది, మొత్తంగా 22 స్థానాల్లో పోటీ చేసినా 0.05 శాతం ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. మరోలా చెప్పాలంటే.. ‘నోటా’కు వచ్చిన ఓట్ల కంటే కూడా అత్యంత తక్కువ ఓట్లను శివసేనకు పోలయ్యాయి.

మరోవైపు సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆ పార్టీ తాజాగా కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కూడా మహారాష్ట్రలో కలిపేందుకు కట్టుబడి వున్నామంటూ మరో సంచలనానికి తెరలేపింది, ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది, మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రితం రోజున ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiv sena  west bengal  assembly elections  sanjay raut  bihar elections  maharashtra  politics  

Other Articles