మహారాష్ట్రలోని భండారా జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అసుపత్రిలో రేగిన అగ్ని ప్రమాదం.. అభంశుభం తెలియని పది మంది పసికందుల ప్రాణాలను హరించింది. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం.. ఆసుపత్రి నిర్మాణంలో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో పది మంది మాతృమూర్తలకు గర్భశోకాన్ని మిగిల్చింది. అసుపత్రి సిబ్బంది తేరుకోవడంతో ఏడుగురు చిన్నారులను రక్షించగలిగారు, భండారా జిల్లాలోని నాలుగు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు.
సమయానికి స్పందించిన ఆసుపత్రిలోని దిగువస్థాయి సిబ్బంది స్పందించడంతో ఏడుగురు పసికందులను రక్షించగలిగారు. వీరంతా నెల రోజుల నుంచి మూడు నెలల లోపున్న చిన్నారులే కావడం గమనార్హం. అగ్నిప్రమాదం ఘటనలో ఏడుగురు చిన్నారులను రక్షించామని, పదిమంది చనిపోయారని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే తెలిపారు. నవజాత శిశువుల విభాగంలో పొగ రావడాన్ని తొలుత ఓ నర్సు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.
భండార్ అసుపత్రి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయవిదారక ఘటన తనను కలచి వేసిందని మోదీ ట్వీట్లు చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన తనను కలచివేసిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ అగ్నిప్రమాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన శిశువుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా, మృతి చెందిన 10 మంది శిశువుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంబంధిత అధికారులను ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more