పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్ పై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ కు మంచినీటి బాటిల్ లో విషపూరిత రసాయనం కలిపి ఇచ్చారన్న వార్తలు గుప్పుమనడంతో సీబీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విషపూరిత తాగునీటి బాటిల్ అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ నీటిని సరఫరా చేసిన కంపెనీతో పాటు నీటిని టేబుల్ పై ఏర్పాటు చేసిన సిబ్బంది వరకు అందరిపై నిఘా పెటి దర్యాప్తు చస్తున్నారు. ఆ ఒక్క బాటిల్ లోనే విషపూరిత రసాయనం కలిసిందా.? లేక అలాంటి బాటిళ్లు ఇంకా వున్నాయా.? అన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తోంది సిబిసిఐడి. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..
తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కక్షసాధింపు చర్యలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాల్పడుతోందని అరోపిస్తూ.. అమె వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో రాజ్ నివాస్ ఎదుట నిన్న ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రాజ్ నివాస్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గోంటున్న అందోళన కార్యక్రమం కావున జాగ్రత్త చర్యలపై సమావేశంలో అధికారలు చర్చించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులకు అంచెలవారీగా భద్రతా కల్పించాలని చర్చించారు.
కాగా, సమావేశంలో పాల్గొన్న అధికారులకు ‘స్విస్ ఫ్రెష్’ అనే ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి బాటిళ్లను సిబ్బంది అందించారు. మంచి నీళ్లు తాగేందుకు కలెక్టర్ పూర్వగార్గ్ బాటిల్ మూత తెరవగానే ఏదో రసాయనం కలిపిన వాసన వచ్చింది. దీంతో అనుమానించిన ఆమె ఆ నీటిని తాగకుండా అధికారులకు అప్పగించి విషయం చెప్పారు. విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ కు ఇచ్చిన బాటిల్ తప్ప మిగతా సీసాల్లో స్వచ్ఛమైన నీరే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డీజీపీ బాలాజీ శ్రీవాస్తవ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్టు బేడీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more