పల్నాడు ఫాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన మరో కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హతమార్చారు. అయితే టీడీపీ నేత హత్యతో ఒక్కసారిగా గుంటూరులో కలకలం రేగింది. రాజకీయ అధిపత్యం కోసం ఈ హత్యలు జరుగుతున్నాయా.? గుంటూరు జిల్లాలో ఫాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయా.? అన్న అనుమానాలు రేగుతున్నాయి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ కీలక నేత పురంశెట్టి అంకులు (65) హత్య స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయ వుందన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు నిన్న సాయంత్రం ఓ ఫోన్ కాల్ రావడంతో రాత్రి 7 గంటల సమయంలో ఒంటరిగా దాచేపల్లి వెళ్లారు. కారును రోడ్డుపై పార్క్ చేసి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ పైకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే మొదటి అంతస్తులో హత్యకు గురయ్యారు. పైకి వెళ్లిన అంకులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పైకి వెళ్లి చూడగా, అక్కడ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. హత్యను నిరసిస్తూ అద్దంకి-నార్కట్ పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు.
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని హత్యపై ఆరాతీశారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, పెదగార్లపాడు వైసీపీ నేతలు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. మరోవైపు, హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకులు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ సహా పలువురిని విచారిస్తున్నారు. పెదగార్లపాడుకు చెందిన అంకులు పదేళ్లపాటు సర్పంచ్ గా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ కూడా సర్పంచ్ గా పనిచేయగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more