100 Dead In Attacks On Two Western Niger Villages ఉగ్రవాదులు ఘాతుకం.. గ్రామస్థులపై కాల్పులు.. 100 మంది మృతి

Attacks on 2 villages in niger kill at least 100 people

Islamic extremists, Prime Minister Brigi Rafini, Tchoma Bangou, Zaroumadareye, presidential results, Boko Haram, Islamic State group, al-Qaida, pakistan, crime

'Terrorists' killed around 100 people in two villages in western Niger, the latest in a string of civilian massacres that have rocked the jihadist-plagued Tillaberi region, a local mayor said Sunday. The attacks on the villages of Tchoma Bangou and Zaroumadareye occurred Saturday just as first-round presidential results were announced.

ఉగ్రవాదులు ఘాతుకం.. గ్రామస్థులపై కాల్పులు.. 100 మంది మృతి

Posted: 01/04/2021 03:20 PM IST
Attacks on 2 villages in niger kill at least 100 people

(Image source from: Pressmediaofindia.com)

నైజర్ దేశాధ్యక్షుడి ఎన్నికల తొలి విడత ఫలితాలు వెలువడుతున్న వేళ అ దేశంలో రక్తపేటేరులు పారాయి. ప్రతీకారేచ్చతో రగలిపోతున్న ఉగ్రవాద మూకలు రెండు గ్రామాలపై తెగబడి కనిపించిన వారందరినీ తుపాకీ తూటాలతో బలితీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా ప్రజల ప్రాణాలను హరించారు. తమపై అనునిత్యం దౌర్జన్యం చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను కొట్టి చంపడమే అక్కడి ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఇద్దరు ఉగ్రవాదుల కోసం రెండు గ్రామాల ప్రజల ప్రాణాలను హరించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్ లో జరిగింది.

అయితే తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఆగడాలను భరించలేకపోయిన గ్రామస్థులు వారిని కొట్టి చంపారు. అయితే ఈ విషయం తెలిసుకున్న ఉగ్రవాద సంస్థ.. తమకు మద్దతుగా వున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైధా ఉగ్రవాద సంస్థల సహకారంతో అర్థరాత్రి ఊరంతా నిద్రిస్తున్న వేళ.. గ్రామంలోకి చొచ్చుకోట్టి.. కనపించినవారిపై తుపాకీ తూటాలను దింపారు. ఈ దారుణం గురించి స్థానిక అధికారుల ద్వారా సమాచారం అందుకున్న అ దేశ ప్రధాని బ్రిగి రఫిని.. బాధిత రెండు గ్రామాలైన టోంబాంగౌ, జారౌమ్ దారే లకు వెళ్లి అక్కడి పిరస్థితిని సమీక్షించారు.

ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజర్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద మూకల దాడులలో హతులైన గ్రామ ప్రజలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాని, ప్రజలకు అండగా తాము వుంటామని ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు వచ్చామని అన్నారు. దేశాధ్యక్షుడు తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. తమతో పాటు యావత్ దేశం గ్రామ ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు, పశ్చిమాఫ్రియా సరిహద్దు గ్రామాలతో పాటు నైజర్ ప్రజలకు కూడా నిత్యం ఉగ్రవాద ప్రభావితానికి గురివుతూనే వున్నారు. ఇప్పటికే ఈ దేశంలోని వేల మంది ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులు హరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles